బన్నీకి విలన్ గా మాజీ హీరోయిన్..?

Published on Jun 3, 2020 1:04 am IST

అల్లు అర్జున్ పాన్ ఇండియా ప్రాజెక్ట్ పుష్పపై రోజుకో పుకారు పుట్టుకొస్తుంది. బన్నీ లారీడ్రైవర్‌ పాత్ర చేస్తుండగా, గంధపు చక్కల స్మగ్లింగ్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ చిత్ర రెగ్యులర్ షూటింగ్ త్వరలోనే ప్రారంభం కాబోతోంది. ఈ చిత్రంలో విలన్‌ పాత్ర కోసం ఫైర్ బ్రాండ్ రోజాని సంప్రదించినట్టు ప్రచారం జరుగుతోంది. క్యారెక్టర్ పవర్‌ఫుల్‌గా వుండటం ఈ సినిమాలో నటించడానికి రోజా అంగీకరించినట్టుగా వార్తలు వస్తున్నాయి.ఇందులో ఎంత వరకు నిజం ఉండో తెలియాలంటే మరికొద్ది రోజులు ఆగాల్సిందే.

గతంలో శంభో శివ శంభో మరియు మొగుడు చిత్రాలలో రోజా నెగెటివ్ రోల్స్ చేసి మెప్పించారు. మరి ఈ చిత్రంలో నిజంగా రోజా నటిస్తే ఈ మూవీకి మరింత ఆకర్షణ తోడైనట్లే. మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో హీరోయిన్ గా రష్మిక మందాన నటిస్తుండగా, దేవిశ్రీ సంగీతం అందిస్తున్నాడు.

సంబంధిత సమాచారం :

More