డెబ్బై ఏళ్ల ఓల్డ్ గెటప్ లో మెగాస్టార్ ?

డెబ్బై ఏళ్ల ఓల్డ్ గెటప్ లో మెగాస్టార్ ?

Published on Feb 26, 2024 5:42 PM IST

మెగాస్టార్ చిరంజీవి హీరోగా యంగ్ దర్శకుడు వశిష్ట ‘విశ్వంభర’ అనే చిత్రాన్ని తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో హీరోయిన్ గా త్రిష నటిస్తోంది. ఐతే, ఈ సినిమాలోని సెకండ్ హాఫ్ లో వచ్చే ఫ్లాష్ బ్యాక్ పై ఓ క్రేజీ అప్ డేట్ వినిపిస్తోంది. ఈ ఫ్లాష్ బ్యాక్ లో మెగాస్టార్ చిరంజీవి పూర్తిగా డెబ్బై ఏళ్ల ఓల్డ్ గెటప్ లో కనిపిస్తాడని.. పైగా చిరంజీవి లుక్ చాలా కొత్తగా ఉంటుందని.. ఇక ఈ ఫ్లాష్ బ్యాక్ లో వచ్చే సీన్స్ కూడా గ్రాండ్ విజువల్స్ తో అద్భుతంగా ఉంటాయని తెలుస్తోంది.

అన్నట్టు రీసెంట్ గా ఈ క్రేజీ ప్రాజెక్ట్ గురించి దర్శకుడు వశిష్ట పలు ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు. ఈ సినిమాలో మెగాస్టార్ ను ఎలా చూడాలి అనుకుంటున్నారో.. ఆయన పాత్ర అలాగే ఉంటుంది అని, దానితో పాటుగా అద్భుతమైన ఫాంటసీ డ్రామా కూడా ఉంటుంది అని వశిష్ట చెప్పుకొచ్చాడు. UV క్రియేషన్స్ నిర్మిస్తున్న ఈ విశ్వంభర సినిమాకు కీరవాణి సంగీతాన్ని అందిస్తున్నారు. ఈ చిత్రం జనవరి 10, 2025న విడుదల కాబోతుంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు