నటీనటుల లుక్స్ పై రాజమౌళి కసరత్తులు

దర్శకధీరుడు రాజమౌళి – మహేష్ బాబు సినిమా కోసం తాను జులై లేదా ఆగస్టులో మ్యూజిక్‌ వర్క్‌ స్టార్ట్‌ చేస్తా’ అని ఎం.ఎం. కీరవాణి చెప్పిన సంగతి తెలిసిందే. మరోవైపు క్యారెక్టర్ ఆర్టిస్ట్ ల ఎంపిక విషయంలో రాజమౌళి టెస్ట్‌ షూట్స్‌ కూడా చేసినట్లు వార్తలు వచ్చాయి. తాజాగా ఈ సినిమా గురించి మరో క్రేజీ అప్ డేట్ వినిపిస్తోంది. ఈ సినిమాలో నటించే విలన్స్ కోసం ప్రత్యేకంగా గెటప్ అండ్ సెటప్ లను రాజమౌళి డిజైన్ చేయిస్తున్నారని.. అలాగే, మహేష్ తో పాటు మిగిలిన ప్రధాన నటీనటులు లుక్స్ విషయంలో కూడా రాజమౌళి ప్రస్తుతం కసరత్తులు చేస్తున్నట్లు తెలుస్తోంది.

అన్నట్టు ఇప్పటికే ఈ సినిమా స్టోరీ లాక్‌ అయ్యింది. ప్రస్తుతం టీమ్ డైలాగ్స్ పూర్తి చేసే పనిలో ఉన్నట్లు తెలుస్తోంది. స్క్రిప్ట్ చాలా బాగా వచ్చిందట. మహేష్ కెరీర్ లోనే స్పెషల్ ఫిల్మ్ గా నిలిచిపోతుందట. కాగా తెలుగు నటీనటులనే కాకుండా, హిందీ, తమిళ చిత్ర పరిశ్రమకు చెందిన నటీనటులు కూడా ఈ సినిమాలో నటించబోతున్నారు. అలాగే, ఈ మూవీలో ఓ హీరోయిన్‌గా చెల్సీ ఎలిజబెత్ ఇస్లాన్ నటించనున్నట్లు తెలుస్తోంది.

Exit mobile version