‘పుష్ప 2’ క్లైమాక్స్ పై క్రేజీ రూమర్

క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా రాబోతున్న ‘పుష్ప 2 ది రూల్’ కోసం ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. తాజాగా ఈ సినిమా క్లైమాక్స్ పై ఓ న్యూస్ వినిపిస్తోంది. యాక్షన్ అభిమానులకు ‘పుష్ప 2’ సినిమా క్లైమాక్స్ ఓ యాక్షన్ ఫీస్ట్ అని.. ముఖ్యంగా పుష్పగా అల్లు అర్జున్ ఊచకోతకు విలన్స్ వెన్నులో వణుకు పుడుతుందని, మొత్తానికి పుష్ప 2 క్లైమాక్స్ సినిమా మొత్తానికే మెయిన్ హైలైట్ గా నిలుస్తోందని తెలుస్తోంది.

ఇక ఈ మూవీ నుంచి ఇప్పటికే రిలీజ్ అయిన గ్లింప్స్, సాంగ్స్ ఆకట్టుకున్నాయి. దీంతో, ఈ సినిమా పై అంచనాలు భారీగా పెరిగిపోయాయి. ముఖ్యంగా హిందీలో పుష్పకి ప్రత్యేకంగా ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. మరోవైపు తెలుగు సినిమాల మార్కెట్ రోజురోజుకు బాలీవుడ్ లో పెరుగుతుంది. కాగా ఈ మూవీలో నేషనల్ క్రష్ రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తుంది. ఇక మైత్రి మూవీ మేకర్స్ సంస్థ పై నవీన్ ఎర్నేని, వై. రవిశంకర్ పాన్ ఇండియన్ రేంజ్ లో గ్రాండ్ గా నిర్మిస్తున్నారు.

Exit mobile version