భారత్ టీంలో టాప్ ఆర్డర్ బౌలర్స్ లో బుమ్రా ఒకరు. బుమ్రా వేసే బౌన్సర్లకు ప్రత్యర్థి బ్యాట్స్ మెన్ వికెట్ పడిపోవాల్సిందే.అలాంటి బుమ్రా బౌన్సర్లకు ఓ హీరోయిన్ కూడా పడిపోయిందని కొన్ని రోజులుగా ఇండస్ట్రీలో పుకార్లు షికారు చేస్తున్నాయి. క్యూటీ అనుపమ పరమేశ్వరన్ క్రికెటర్ బుమ్రా ప్రేమించుకుంటున్నారని సినీజనాలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. దీనికి వారు చెవుతున్న కారణాలు సామజిక మాధ్యమాలలో వీరు ఒకరినొకరు ఫాలో అవుతూవుంటారట. ఒకరి పోస్టులకు మరోకరు లైక్స్ మరియు కామెంట్స్ తో రెచ్చిపోతూవుంటారట. అంతే కాకుండా సోషల్ మీడియాలో బుమ్రా ఫాలో అవుతున్న హీరోయిన్ కేవలం అనుపమ ఒక్కరేనట.
ఏమి ఆధారాలు లేకపోతేనే రెచ్చిపోయే సినీజనాలు ఈ మాత్రం ప్రూఫ్స్ దొరికేసరికి తమకు ఇష్టం వచ్చినట్లుగా చెవులుకొరుకుంటున్నారట. ఈ వదంతులు ఆనోటా ఈనోటా పడి అనుపమ వరకు చేరడంతో వివరణ ఎచుకోవాల్సివచ్చిందిట. ఈ సందర్భంగా బుమ్రా తనకు మంచి స్నేహితుడని ఓ ఆంగ్ల మీడియా ద్వారా క్లారిటీ ఇచ్చారు. అంతేకానీ..అంతకు మించి మా మధ్య ఎలాంటివిసంబంధం లేదు, ఇలాంటి పుకార్లు పుట్టించకండి అని సంధానం ఇచ్చిందట. అనుపమ ప్రస్తుతం బెల్లంకొండ శ్రీనివాస్ తో “రాక్షసుడు” చేస్తున్నారు.