“జాతి రత్నాలు”పై క్రికెటర్ దినేష్ కార్తీక్ వ్యూ చూసారా.!

Published on Apr 16, 2021 6:09 pm IST


యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో నవీన్ పొలిశెట్టి హీరోగా ఫరియా అబ్దుల్లా హీరోయిన్ గా నటించిన లేటెస్ట్ చిత్రం “జాతి రత్నాలు”. అనుదీప్ కేవీ దర్శకత్వం వహించిన ఈ చిత్రం గత మార్చ్ లో విడుదలై ఎంత పెద్ద విజయాన్ని సొంతం చేసుకుందో చూసాము. హిలేరియస్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈ చిత్రం ఓ రేంజ్ హిట్ అయ్యింది.మరి ఇప్పుడు ఈ సినిమాను ఇండియన్ స్టార్ క్రికెటర్ మరియు కోల్ కతా నైట్ రైడర్స్ మాజీ క్యాప్టెన్ దినేష్ కార్తీక్ తన వ్యూ సోషల్ మీడియా ద్వారా వెల్లడించాడు.

“జాతి రత్నాలు సినిమా చూసి ఓ రేంజ్ లో నవ్వుకున్నానని అమేజింగ్ డైలాగ్స్, బ్రిలియెంట్ డైరెక్షన్ ప్రతీ ఒక్కరి పెర్ఫామెన్స్ లు చాలా బాగున్నాయని తెలిపాడు. అంతే కాకుండా ఇలాంటి జానర్ లో సినిమాలు తియ్యడం కష్టమని కానీ వీరు మాత్రం అవుట్ స్టాండింగ్ జాబ్ అందించారు” అని దినేష్ కార్తీక్ జాతి రత్నాలు సినిమాపై తన వ్యూ చెప్పాడు.

అయితే చాలా మందికి దినేష్ కార్తీక్ కి తెలుగు వచ్చా అని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అయితే గత ఏడాది చెన్నై కి కోల్ కతా కి జరిగిన ఓ మ్యాచ్ లో దినేష్ కార్తీక్ తెలుగు వచ్చిన అంపైర్ తో తెలుగు మాట్లాడిన క్లిప్ వైరల్ అయ్యింది. వారికి అయితే తెలిసి ఉండొచ్చు దినేష్ కార్తీక్ కు తెలుగు కూడా వచ్చు అని. మొత్తానికి మాత్రం జాతి రత్నాలకి దినేష్ కార్తీక్ ఇచ్చిన రివ్యూ ఇప్పుడు వైరల్ అవుతుంది.

సంబంధిత సమాచారం :