రామ్ చరణ్ వేరే లెవెల్ నటుడు – చిన్న థలా సురేష్ రైనా కామెంట్స్

రామ్ చరణ్ వేరే లెవెల్ నటుడు – చిన్న థలా సురేష్ రైనా కామెంట్స్

Published on Sep 4, 2024 9:00 AM IST

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా ఇప్పుడు నటిస్తున్న లేటెస్ట్ అవైటెడ్ చిత్రం “గేమ్ ఛేంజర్” కోసం అందరికీ తెలిసిందే. మావెరిక్ దర్శకుడు శంకర్ కాంబినేషన్ లో వస్తున్నా ఈ అవైటెడ్ సినిమా ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో భారీ బిజినెస్ చేస్తుంది. ఇక ఇదిలా ఉండగా రామ్ చరణ్ కూడా తన క్రేజ్ ని మరింత పెంచుకుంటున్నాడు అని చెప్పాలి. లేటెస్ట్ గా ఇండియన్ డాషింగ్ క్రికెటర్, చెన్నై సూపర్ కింగ్స్ చిన్న థలాగా పిలవబడే సురేష్ రైనా చేసిన కామెంట్స్ వైరల్ గా మారాయి.

రీసెంట్ గా రైనా ఇచ్చిన ఇంటర్వ్యూలో రామ్ చరణ్ అలగ్ యాక్టర్ హైన్( రామ్ చరణ్ వేరే లెవెల్ నటుడు) అంటూ తనకి ఇష్టమైన నటుల్లో రామ్ చరణ్ కూడా ఒకరు అని కామెంట్స్ చేసాడు. దీనితో తన కామెంట్స్ ఇపుడు మెగా అభిమానుల్లో వైరల్ గా మారాయి. అలాగే సౌత్ సినిమా నుంచి నటుడు సూర్య కూడా ఇష్టం అంటూ రైనా తెలిపాడు. దీనితో తన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు