‘స‌రిపోదా శ‌నివారం’ నుంచి క్యారెక్ట‌ర్స్ రివీల్

‘స‌రిపోదా శ‌నివారం’ నుంచి క్యారెక్ట‌ర్స్ రివీల్

Published on Jul 27, 2024 8:00 PM IST

నేచుర‌ల్ స్టార్ నాని న‌టిస్తున్న తాజా చిత్రం ‘స‌రిపోదా శ‌నివారం’ షూటింగ్ ప‌నులు ముగించుకుని పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ ప‌నుల్లో బిజీగా ఉంది. ఈ సినిమా నుంచి వ‌రుస అప్డేట్స్ తో చిత్ర యూనిట్ అభిమానుల‌ను థ్రిల్ చేస్తోంది. ఇప్ప‌టికే ఈ సినిమా నుంచి ప‌లు పోస్ట‌ర్స్, వీడియో గ్లింప్స్, సాంగ్స్ రిలీజ్ చేశారు. తాజాగా ఈ సినిమాలోని ప‌లు పాత్ర‌ల‌ను ప్రేక్ష‌కుల‌కు ప‌రిచ‌యం చేశారు.

ఈ సినిమాలో నారాయ‌ణ ప్ర‌భ గా ప్ర‌ముఖ నటుడు అజ‌య్ ఘోష్ న‌టిస్తున్నారు. ఆయ‌న లుక్ ఈ సినిమాలో స‌రికొత్త‌గా ఉండ‌టంతో ప్రేక్ష‌కుల్లో ఈ సినిమాపై ఆస‌క్తి రేకెత్తుతోంది. ఇక ఆయ‌న అనుచ‌రులుగా కాళి, మార్టిన్ ల‌ను కూడా ప‌రిచ‌యం చేశారు. అంతేగాక‌, కూర్మానంద్ గా ముర‌ళీశ‌ర్మ‌, గోవ‌ర్ధ‌న్ గా అజ‌య్, భ‌ద్ర‌గా అదితి బాల‌న్ ల‌తో పాటు ది వ‌ర‌ల్డ్ ఆఫ్ సోకుల‌పాలెం ను కూడా మేక‌ర్స్ రివీల్ చేశారు. ఇక తాజాగా సుధా గా హ‌ర్ష‌వ‌ర్ధ‌న్, క‌మ‌లాక‌ర్ గా శుభ‌లేఖ సుధాక‌ర్ ల పోస్ట‌ర్స్ ను కూడా మేక‌ర్స్ రిలీజ్ చేశారు.

ఇలా వ‌రుస పోస్ట‌ర్స్ ను రిలీజ్ చేస్తుండ‌టంతో ఈ సినిమాపై ప్రేక్ష‌కుల్లో మ‌రింత ఆస‌క్తి క్రియేట్ అవుతోంది. ఇక ఈ సినిమాలో నాని ఓ ప‌వ‌ర్ఫుల్ పాత్ర‌లో న‌టిస్తుండ‌గా అందాల భామ ప్రియాంక మోహ‌న్ హీరోయిన్ గా న‌టిస్తోంది. ఎస్.జె.సూర్య ఈ సినిమాలో విల‌న్ పాత్ర‌లో న‌టిస్తున్నాడు. జేక్స్ బిజాయ్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాను డివివి ఎంట‌ర్టైన్మెంట్స్ పై దాన‌య్య ప్రొడ్యూస్ చేస్తున్నారు. ఆగ‌స్టు 29న వ‌ర‌ల్డ్ వైడ్ గా ఈ సినిమాను రిలీజ్ చేయ‌నున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు