సక్సెస్ఫుల్ గా ఏడాది పూర్తి చేసుకున్న కల్ట్ క్లాసిక్ ‘కాంతారా’

సక్సెస్ఫుల్ గా ఏడాది పూర్తి చేసుకున్న కల్ట్ క్లాసిక్ ‘కాంతారా’

Published on Sep 30, 2023 7:00 PM IST

కన్నడ నటుడు రిషబ్ శెట్టి నటిస్తూ స్వయంగా తెరకెక్కించిన డివైన్ బ్లాక్ బస్టర్ పాన్ ఇండియన్ మూవీ కాంతారా. సప్తమి గౌడ హీరోయిన్ గా నటించిన ఈ మూవీ కన్నడతో పాటు రిలీజ్ అయిన అన్ని భాషల్లో కూడా భారీ విజయం సొంతం చేసుకుంది.

హోంబలె ఫిలిమ్స్ బ్యానర్ పై దీనిని విజయ్ కిరగందూర్ భారీ స్థాయిలో నిర్మించారు. ఇక ఈ మూవీ యొక్క కథ, కథనాలు, డైరెక్టర్ రిషబ్ శెట్టి అద్భుత నటన, అత్యద్భుతంగా తెరకెక్కిన సీన్స్, వరాహ రూపం సాంగ్ , బ్యాక్ గ్రౌండ్ స్కోర్, విజువల్స్, ఎమోషనల్ సీన్స్ ఇలా అన్ని కూడా ఆడియన్స్ ని ఎంతో ఆకట్టుకున్నాయి.

విషయం ఏమిటంటే, ఈ కల్ట్ క్లాసిక్ మూవీ నేటితో సక్సెస్ఫుల్ గా ఏడాది పూర్తి చేసుకోవడం తమకు ఎంతో ఆనందంగా ఉందని, ఈ జర్నీని మరింత కొనసాగించేందుకు సిద్దమవుతున్నాము అంటూ మేకర్స్ పెట్టిన పోస్ట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కాగా ఈ మూవీకి సీక్వెల్ గా కాంతారా 2 త్వరలో పట్టాలెక్కనున్న విషయం తెలిసిందే.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు