‘స్కంద’ నుండి ‘కల్ట్ మామ’ సాంగ్ రిలీజ్ డేట్ ఫిక్స్

‘స్కంద’ నుండి ‘కల్ట్ మామ’ సాంగ్ రిలీజ్ డేట్ ఫిక్స్

Published on Sep 16, 2023 9:00 PM IST

రామ్ పోతినేని తో ప్రస్తుతం మాస్ యాక్షన్ సినిమాల దర్శకుడు బోయపాటి శ్రీను తెరకెక్కిస్తున్న భారీ మాస్ ఫ్యామిలీ యాక్షన్ పాన్ ఇండియా మూవీ స్కందలో హీరోగా నటిస్తున్నారు. ఈ మూవీలో శ్రీలీల హీరోయిన్ గా నటిస్తుండగా కీలక పాత్రలో సాయి మంజ్రేకర్ నటిస్తున్నారు. ఎస్ థమన్ సంగీతం అందిస్తున్న ఈ మూవీని శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ బ్యానర్ పై శ్రీనివాస్ చిట్టూరి నిర్మిస్తుండగా ఇతర పాత్రల్లో ప్రిన్స్, దగ్గుబాటి రాజా, గౌతమి, ఇంద్రజ, శ్రీకాంత్ తదితరులు నటిస్తున్నారు.

ఇటీవల స్కంద నుండి రిలీజ్ అయిన రెండు సాంగ్స్, టీజర్, ట్రైలర్ అందరినీ ఆకట్టుకోగా తాజాగా ఈ మూవీ నుండి కల్ట్ మామ అనే పల్లవితో సాగే మాస్ సాంగ్ ని సెప్టెంబర్ 18న రిలీజ్ చేసేందుకు సిద్ధం అయ్యారు మేకర్స్. మంచి మాస్ ట్యూన్ తో సాగనున్న ఈ సాంగ్ యువత ని మాస్ ఆడియన్స్ ని ఆకట్టుకుంటుందని పోస్టర్ ని బట్టి చూస్తే తెలుస్తుంది. కాగా ఈ మూవీని అన్ని కార్యక్రమాలు ముగుయించి సెప్టెంబర్ 28న పలు భాషల ఆడియన్స్ ముందుకి తీసుకురానున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు