Jani Master: జానీ మాస్టర్ కేసుపై DCP ప్రకటన

ప్రముఖ కొరియోగ్రఫర్ జానీ మాస్టర్‌పై లైంగిక వేధింపుల కేసు నమోదు కావడంతో టాలీవుడ్‌లో ప్రకంపనలు చెలరేగాయి. ఓ లేడీ అసిస్టెంట్ కొరియోగ్రఫర్‌పై ఆయన లైంగిక వేధింపులకు పాల్పడ్డాడని ఆరోపణలు వచ్చాయి. ఇక ఈ కేసుపై ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో జోరుగా చర్చ సాగుతోంది.

అయితే, ఈ కేసుపై సైబరాబాద్ DCP తాజాగా ఓ ప్రకటన విడుదల చేశారు. తొలుత రాయిదుర్గం పోలీస్ స్టేషన్‌లో జానీ మాస్టర్‌పై ఫిర్యాదు నమోదు కావడంతో జీరో ఎఫ్ఐఆర్ నమోదు అయ్యింది. ఆ తరువాత సెప్టెంబర్ 15న నార్సింగి పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు అయ్యింది. అయితే, బాధితురాలు 2020 నుంచి జానీ మాస్టర్ తనపై వేధింపులకు పాల్పడ్డాడని చెప్పడంతో.. అప్పటికి ఆమె మైనర్ అని పోలీసులు పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు.

ఇక సెప్టెంబర్ 19న నిందితుడు గోవాలో ఉన్నట్లు తెలుసుకుని, అతడిని అదుపులోకి తీసుకుని అక్కడి స్థానిక కోర్టులో హాజరు పరచినట్లుగా తెలిపారు. ట్రాన్సిట్ వారెంట్ తీసుకుని, నిందితుడు జానీ మాస్టర్‌ని హైదరాబాద్‌కు తరలిస్తున్నట్లు DCP తెలిపారు.

Exit mobile version