“డాకు మహారాజ్” 4 రోజుల తెలుగు రాష్ట్రాల వసూళ్లు!

“డాకు మహారాజ్” 4 రోజుల తెలుగు రాష్ట్రాల వసూళ్లు!

Published on Jan 16, 2025 11:00 AM IST

నందమూరి బార్న్ కింగ్ గాడ్ ఆఫ్ మాసెస్ బాలకృష్ణ నటించిన లేటెస్ట్ చిత్రమే “డాకు మహారాజ్”. దర్శకుడు కొల్లి బాబీ తెరకెక్కించిన ఈ సినిమా కోసం అభిమానులు ఓ రేంజ్ లో ఎదురు చూడగా వారి అంచనాలకి తగ్గట్టుగానే సినిమా ఉండడంతో బాలయ్య కెరీర్ లో రికార్డు ఓపెనింగ్స్ ఈ చిత్రానికి దక్కాయి. ఇలా మన తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమా రికార్డు వసూళ్లు అందుకోగా మొత్తం 4 రోజుల రన్ ని కంప్లీట్ చేసుకుంది. అయితే ఈ నాలుగో రోజు వసూళ్లు పిఆర్ లెక్కల ప్రకారం ఏరియాల వారీగా చూసినట్టు అయితే

నైజాం – 1.47 కోట్లు
సీడెడ్ – 1.20 కోట్లు
ఉత్తరాంధ్ర – 1.23 కోట్లు
గుంటూరు – 0.53 కోట్లు
కృష్ణ – 0.57 కోట్లు
తూర్పు గోదావరి – 0.72 కోట్లు
వెస్ట్ గోదావరి – 0.45 కోట్లు
నెల్లూరు – 0.28 కోట్లు

నాలుగో రోజు మొత్తం 6.45 కోట్ల రూపాయల షేర్ ని డాకు మహారాజ్ అందుకోగా మొత్తం నాలుగు రోజుల్లో సినిమా ఎంత వసూలు చేసింది అనేది చూద్దాం.

నైజాం – 10.15 కోట్లు
సీడెడ్ – 9.87 కోట్లు
ఉత్తరాంధ్ర – 5.68 కోట్లు
గుంటూరు – 5.89 కోట్లు
కృష్ణ – 3.72 కోట్లు
తూర్పు గోదావరి – 4.16 కోట్లు
వెస్ట్ గోదావరి – 3.18 కోట్లు
నెల్లూరు – 2.49 కోట్లు

మొత్తం 45.14 కోట్ల షేర్ ని డాకు మహారాజ్ ఒక్క తెలుగు రాష్ట్రాల నుంచి అది కూడా జిఎస్టి కాకుండా అందుకోవడం విశేషం. మరి ఫైనల్ రన్ లో డాకు మహారాజ్ ఎక్కడ వరకు వెళ్లి ఆగుతుందో చూడాలి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు