గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ నటించిన లేటెస్ట్ మూవీ ‘డాకు మహారాజ్’ సంక్రాంతి కానుకగా గ్రాండ్ రిలీజ్‌కు రెడీ అయ్యింది. దర్శకుడు బాబీ కొల్లి డైరెక్ట్ చేసిన ఈ యాక్షన్ ఎంటర్‌టైనర్ మూవీలో బాలయ్య పాత్ర ప్రేక్షకులను ఆకట్టుకునే విధంగా ఉండబోతుందని చిత్ర యూనిట్ చెబుతోంది. ఇక ఈ సినిమా నుంచి ఇప్పటికే రిలీజ్ అయిన పోస్టర్స్, టీజర్, ట్రైలర్లు ఈ మూవీపై అంచనాలను అమాంతం పెంచేశాయి. ‘గేమ్ ఛేంజర్’, ‘సంక్రాంతికి వస్తున్నాం’ సినిమాలతో పోటీకి దిగుతున్న ‘డాకు మహారాజ్’ రిలీజ్ విషయంలో మేకర్స్ ప్లాన్ మార్చినట్లుగా సినీ సర్కిల్స్‌లో టాక్ వినిపిస్తోంది.
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ‘గేమ్ ఛేంజర్’ మూవీ పాన్ ఇండియా స్థాయిలో సాలిడ్ రిలీజ్‌కు రెడీ అవుతోంది. ‘సంక్రాంతికి వస్తున్నాం’ పక్కా తెలుగు ఫ్లేవర్ ఉన్న సినిమా కావడంతో, ఈ మూవీని కేవలం తెలుగులోనే రిలీజ్ చేస్తున్నారు. అయితే, ‘డాకు మహారాజ్’ కథ గ్లోబల్ ఆడియన్స్ మెచ్చే విధంగా ఉంది. అందులోని యాక్షన్, ఎమోషన్ అన్ని కూడా అందరికీ కనెక్ట్ అవుతాయి. కానీ, ఇప్పటివరకు దీన్ని కేవలం తెలుగులోనే రిలీజ్ చేయబోతున్నారనే టాక్ వినిపించింది.
కానీ, ఇప్పుడు ‘డాకు మహారాజ్’ చిత్రాన్ని తెలుగుతో పాటు తమిళ్, హిందీ భాషల్లో డబ్ చేసి రిలీజ్ చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారట. దీనికి సంబంధించిన వర్క్ కూడా నడుస్తుందని సినీ సర్కిల్స్‌లో టాక్ వినిపిస్తోంది. దీంతో డాకు మహారాజ్ కూడా పాన్ ఇండియా సినిమాగా ప్రేక్షకుల ముందుకు రావచ్చని తెలుస్తోంది. మరి ఈ వార్తల్లో ఎంతవరకు నిజం ఉందో తెలియాలంటే అధికారిక ప్రకటన వచ్చే వరకు వెయిట్ చేయాల్సిందే.