నైజాం టికెట్ రేట్లపై నాగవంశీ హ్యాపీ

నైజాం టికెట్ రేట్లపై నాగవంశీ హ్యాపీ

Published on Jan 8, 2025 2:00 AM IST

ప్రస్తుతం టాలీవుడ్ ప్రేక్షకులు సంక్రాంతి సినిమాల కోసం ఎంతో ఆసక్తిగా చూస్తున్నారు. ఈ పండుగ సీజన్‌లో ముచ్చటగా మూడు సినిమాలు ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమయ్యాయి. రామ్ చరణ్ ‘గేమ్ ఛేంజర్’, నందమూరి బాలకృష్ణ ‘డాకు మహారాజ్’, విక్టరీ వెంకటేష్ ‘సంక్రాంతికి వస్తున్నాం’ చిత్రాలతో తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకునేందుకు రెడీ అయ్యారు.

అయితే, ఇటీవల ‘పుష్ప 2’ మూవీ రిలీజ్ టైమ్‌లో సంధ్య థియేటర్ ఘటన కారణంగా తెలంగాణలో టికెట్ రేట్ల పెంపు, బెనిఫిట్ షోలకు తెలంగాణ సర్కార్ నో చెప్పిన సంగతి తెలిసిందే. దీంతో ఇప్పుడు సంక్రాంతి సినిమాలపై ఇది ఎలాంటి ప్రభావం చూపుతుందా అని అందరూ ఆసక్తిగా చూస్తున్నారు. కానీ, ‘డాకు మహారాజ్’ చిత్ర నిర్మాత నాగవంశీ నైజాం ఏరియాలో ప్రస్తుతం ఉన్న టికెట్ రేట్లు తనకు ఎలాంటి ఇబ్బందిని కలిగించే విధంగా లేవని.. ఈ రేట్లతో కూడా తమ సినిమా లాభాలు తెచ్చిపెడుతుందని ధీమా వ్యక్తం చేస్తున్నారు.

కాగా, ఏపీలో సంక్రాంతి సినిమాలకు టికెట్ రేట్లు పెంచుకునేందుకు అక్కడి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సంగతి తెలిసిందే. మరి తెలంగాణ సర్కార్ నిజంగానే సంక్రాంతి సినిమాలకు టికెట్ రేట్ల పెంపుకు అనుమతులు ఇవ్వదా… ప్రస్తుతం ఉన్న రేట్లతో ఈ సినిమాలు ఎలాంటి వసూళ్లు రాబడతాయి.. అనేది ఆసక్తికరంగా మారింది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు