“డాకు మహారాజ్” నిర్మాత నాగవంశీ ప్రత్యేక విన్నపం!

ప్రస్తుతం మన టాలీవుడ్ లో ఉన్నటువంటి యంగ్ అండ్ ఫ్యాషనేటెడ్ నిర్మాతల్లో యువ నిర్మాత సూర్యదేవర నాగవంశీ కూడా ఒకరు. మరి తన సినిమాల పట్ల ఉన్న గ్రిప్ కానీ ముక్కుసూటి మాటలు కాన్ఫిడెన్స్ తో ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో మంచి హైలైట్ గా తాను కనిపిస్తూ ఉంటారు. అలాగే చెప్పి మరీ సినిమాని సక్సెస్ కొట్టడంలో తనకి సెపరేట్ ట్రాక్ రికార్డు కూడా ఉంది.

అయితే ఇపుడు తన బ్యానర్ సితార ఎంటర్టైన్మెంట్స్ నుంచి సంక్రాంతి కానుకగా వస్తున్న లేటెస్ట్ చిత్రమే “డాకు మహారాజ్”. తన అభిమాన హీరో నందమూరి నటసింహం బాలకృష్ణతో దర్శకుడు కొల్లి బాబీ కాంబినేషన్ లో తెరకెక్కించిన ఈ సినిమాపై గట్టి అంచనాలు ఉన్నాయి.

అయితే ఈ సినిమా రిలీజ్ కి దగ్గరకి వస్తున్న సమయంలోజరుగుతున్న చిన్న చిన్న పొరపత్యాల విషయంలో నందమూరి అభిమానులకి తన వైపు నుంచి ప్రత్యేక విన్నపాన్ని తెలుపడం ఇపుడు వైరల్ గా మారింది. “ఇది మన అందరి సినిమా. నాకు మీ అందరి సపోర్ట్ చాలా అవసరం. అందరం ప్రశాంతంగా ఉండి మన సినిమా అతి పెద్ద బ్లాక్ బస్టర్ సక్సెస్ అవ్వటానికి ప్రయత్నిద్దాం.” అంటూ పోస్ట్ చేశారు. దీనితో తన పోస్ట్ ఇపుడు వైరల్ గా మారింది.

Exit mobile version