ఈ సంక్రాంతి బరిలో రిలీజ్ కి రాబోతున్న టాలీవుడ్ చిత్రాల్లో నందమూరి నటసింహం బాలకృష్ణ హీరోగా దర్శకుడు బాబీ కొల్లి తెరకెక్కించిన అవైటెడ్ భారీ మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ చిత్రం “డాకు మహారాజ్” కూడా ఒకటి. మరి ట్రైలర్ తర్వాత మరిన్ని అంచనాలు సెట్ చేసుకున్న ఈ చిత్రం కోసం అభిమానులు సహా మాస్ ఆడియెన్స్ కూడా బాగా ఎదురు చూస్తున్నారు. అయితే ఈ సినిమాపై మన దగ్గర ఆడియెన్స్ కి ఓ రేంజ్ లో ఇంట్రెస్ట్ ఉన్నట్టుగా క్లియర్ గా కనిపిస్తుంది.
ప్రముఖ ఆన్లైన్ బుకింగ్స్ యాప్ బుక్ మై షోలో డాకు మహారాజ్ పట్ల ఏకంగా 2 లక్షలకి పైగా ఇంట్రెస్ట్స్ నమోదు అయ్యాయి. దీనితో ఈ సినిమా కోసం ఆడియెన్స్ ఎలా ఎదురు చూస్తున్నారో అర్ధం చేసుకోవచ్చు. ఇక ఈ చిత్రానికి థమన్ సంగీతం అందిస్తుండగా ప్రగ్యా జైస్వాల్, శ్రద్దా శ్రీనాథ్ అలాగే చాందిని చౌదరి కీలక పాత్రల్లో నటిస్తున్నారు. అలాగే సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చూన్ ఫోర్ సినిమాస్ వారు నిర్మాణం వహించిన ఈ చిత్రం ఈ జనవరి 12న రిలీజ్ కి రాబోతుంది.
???????????? ???????? ???????????????????????? #NandamuriBalakrishna is already turning heads and claiming hearts ahead of the BIG DAY! ????????
????????????????+ INTERESTS for #DaakuMaharaaj on @bookmyshow ????????
???????????? ????????, ???????????????? ~ Theatres will turn into a MASS CARNIVAL this… pic.twitter.com/3c9UrFcmI4
— Sithara Entertainments (@SitharaEnts) January 7, 2025