ఓటిటిలో “డాకు మహారాజ్” సర్ప్రైజ్ చెయ్యబోతుందా!

ఓటిటిలో “డాకు మహారాజ్” సర్ప్రైజ్ చెయ్యబోతుందా!

Published on Feb 15, 2025 12:00 AM IST

ఈ సంక్రాంతి కానుకగా మన తెలుగు సినిమా దగ్గర రిలీజ్ కి వచ్చిన లేటెస్ట్ హిట్ చిత్రాల్లో నందమూరి నటసింహం బాలకృష్ణ హీరోగా ప్రగ్యా జైస్వాల్ అలాగే ఊర్వశి రౌతేలా ఫీమేల్ లీడ్ లో నటించగా దర్శకుడు కొల్లి బాబీ తెరకెక్కించిన “డాకు మహారాజ్” కూడా ఒకటి. మరి బాలయ్య కెరీర్లో మరో సూపర్ హిట్ గా నిలిచిన ఈ చిత్రం తన కెరీర్లో హైయెస్ట్ గ్రాసర్ గా నిలిచింది. అయితే ఈ సినిమా నెల రోజులు దాటేసినప్పటికీ ఇంకా ఓటిటిలో రాలేదు.

ఈ సినిమా స్ట్రీమింగ్ హక్కులు దిగ్గజ స్ట్రీమింగ్ సంస్థ నెట్ ఫ్లిక్స్ సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. మరి ఇందులో సినిమా ఎప్పుడెప్పుడు వస్తుందా అని అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అయితే డేట్ పై ప్రస్తుతానికి క్లారిటీ లేదు కానీ ఓటిటిలో మాత్రం డాకు మహారాజ్ సర్ప్రైజ్ చేస్తుంది అని ఓ టాక్ వినిపిస్తుంది. మరి, కొన్ని చూడని కొత్త సన్నివేశాలు ఏమన్నా యాడ్ చేస్తున్నారో ఏమో గాని డాకు మహారాజ్ కొత్త వెర్షన్ ఓటిటిలో సందడి చేయనున్నట్టు తెలుస్తుంది. మరి దీనిపై మరింత క్లారిటీ రావాల్సి ఉంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు