‘డాకు మహారాజ్’ ట్రైలర్ : యాక్షన్ తో పాటు ఎమోషన్ తోనూ !

‘డాకు మహారాజ్’ ట్రైలర్ : యాక్షన్ తో పాటు ఎమోషన్ తోనూ !

Published on Jan 5, 2025 10:03 AM IST

నటసింహం బాలయ్య – దర్శకుడు బాబీ కాంబినేషన్‌ లో రాబోతున్న సినిమా “డాకు మహారాజ్”. ఈ యాక్షన్-ప్యాక్డ్ ఎమోషనల్ డ్రామా నుంచి ట్రైలర్‌ రిలీజ్ అయింది. యూఎస్ ఏ లోని డల్లాస్‌లో జరిగిన ప్రీ-రిలీజ్ ఈవెంట్‌లో ఈ ట్రైలర్ ను రిలీజ్ చేశారు. ట్రైలర్ చాలా పవర్ ఫుల్ గా సాగింది. యాక్షన్ తో పాటు ఎమోషన్ మూమెంట్స్ ను కూడా ట్రైలర్ లో చాలా బాగా కట్ చేశారు. ముఖ్యంగా కథాంశాన్ని రహస్యంగా ఉంచడంతో ట్రైలర్ లో ఉత్కంఠ బాగా ఎలివేట్ అయింది.

ఇక బాలకృష్ణ ఎప్పటిలాగే వైల్డ్ గా అండ్ సెటిల్డ్ గా కనిపించారు. మొత్తానికి యాక్షన్‌కు మించి, సినిమాలో ఎమోషనల్ డెప్త్ ఉండేలా ట్రైలర్ ను డిజైన్ చేశారు. ముఖ్యంగా చైల్డ్ సెంటిమెంట్, ఒక స్టాండ్ అవుట్ ఎలిమెంట్‌గా ఉండబోతుంది. ఇక “డాకు మహారాజ్” సినిమా జనవరి 12, 2025న గ్రాండ్ రిలీజ్‌కి సిద్ధంగా ఉంది. కాగా ఈ చిత్రంలో శ్రద్ధా శ్రీనాథ్ మరియు ప్రగ్యా జైస్వాల్ కథానాయికలుగా నటించారు.

సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై నాగ వంశీ, ఫార్చూన్‌ ఫోర్ సినిమాపై సాయి సౌజన్య ఈ సినిమాని నిర్మిస్తున్నారు. చాందినీ చౌదరి ఈ సినిమాలో కీలక పాత్రలో నటిస్తోంది. ఇక ఈ చిత్రానికి తమన్ సంగీతం అందిస్తుండగా బాబీ డియోల్ మరో కీలక పాత్రలో నటిస్తున్నాడు.

ట్రైలర్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

సంబంధిత సమాచారం

తాజా వార్తలు