నందమూరి బాలకృష్ణ లేటెస్ట్ మూవీ ‘డాకు మహారాజ్’ సంక్రాంతి బరిలో జనవరి 12న గ్రాండ్ రిలీజ్‌కు రెడీ అయిన సంగతి తెలిసిందే. ఈ సినిమాను దర్శకుడు బాబీ డైరెక్ట్ చేయగా, బాలకృష్ణ తనదైన పర్ఫార్మెన్స్‌తో ప్రేక్షకులను ఆకట్టుకునేందుకు సిద్ధమయ్యాడు. ఇక ఈ సినిమా నుంచి ఇప్పటికే రిలీజ్ అయిన టీజర్, ట్రైలర్ ఈ సినిమాపై అంచనాలను అమాంతం పెంచేశాయి.
దీనికితోడు ఈ సినిమాను ఓవర్సీస్‌లో ప్రమోట్ చేసేందుకు అక్కడ ఓ గ్రాండ్ ఈవెంట్‌ను కూడా మేకర్స్ నిర్వహించారు. ఈ ఈవెంట్‌కు బాలయ్య కూడా హాజరుకావడంతో ఇది గ్రాండ్ సక్సె్స్ అయ్యింది. అయితే, ఈ ఈవెంట్‌కు సంబంధించిన ఫుల్ వీడియోను మేకర్స్ రిలీజ్ చేసేందుకు రెడీ అయ్యారు.
జనవరి 7న ఈ ఈవెంట్‌కి సంబంధించిన పూర్తి వీడియోను రిలీజ్ చేయబోతున్నట్లు మేకర్స్ వెల్లడించారు. ఇక ఈ సినిమాలో బాలీవుడ్ నటుడు బాబీ డియోల్ విలన్ పాత్రలో నటిస్తుండగా ప్రగ్యా జైస్వాల్, శ్రద్ధా శ్రీనాథ్, చాందిని చౌదరి, ఊర్వశి రౌటేలా తదితరులు ఇతర ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. థమన్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నాడు.
All efforts are on track to deliver a MEMORABLE MASS SANKRANTHI from these Main men – @dirbobby & @MusicThaman ????????????????
The much awaited USA Event Video will be out tomorrow! ????❤️????#DaakuMaharaaj Worldwide Grand Release on Jan 12, 2025 ????
???????????? ???????? ????????????????????????… pic.twitter.com/RbwEPmvwP1
— Sithara Entertainments (@SitharaEnts) January 6, 2025