తన రేజ్ చూపెట్టిన డాకు మహారాజ్.. అదిరిపోయిన ఫస్ట్ సింగిల్ సాంగ్

తన రేజ్ చూపెట్టిన డాకు మహారాజ్.. అదిరిపోయిన ఫస్ట్ సింగిల్ సాంగ్

Published on Dec 14, 2024 7:03 PM IST

గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘డాకు మహారాజ్’ సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ చిత్రాన్ని దర్శకుడు బాబీ కొల్లి డైరెక్ట్ చేస్తుండగా పూర్తి మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా ఈ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకునేందుకు సిద్ధమవుతుంది. ఇక ఈ సినిమా పోస్టర్స్, వీడియో గ్లింప్స్‌లు ప్రేక్షకుల్లో ఈ సినిమాపై అంచనాలు పెంచేశాయి. తాజాగా ఈ చిత్రంలోని ఫస్ట్ సింగిల్ సాంగ్ రిలీజ్ చేశారు మేకర్స్.

ఈ సాంగ్ ఆద్యంతం పవర్‌ఫుల్ మ్యూజిక్‌తో ఆడియెన్స్‌ను ఆకట్టుకుంది. థమన్ అందించిన సంగీతం ఈ సాంగ్‌ను ఇన్‌స్టంట్ చార్ట్ బస్టర్‌గా మార్చేసింది. బాలయ్య సినిమా అనగానే థమన్ మ్యూజిక్ ఎందుకు స్పెషల్‌గా ఉంటుందో మనకు ఈ సాంగ్ చూస్తే మరోసారి అర్థమవుతోంది. ఇక అనంత్ శ్రీరామ్ ఈ పాటకు లిరిక్స్ అందించగా నకాశ్ అజీజ్, భరత్ రాజ్, రితేజ్ జి రావు, ప్రణతి పాడారు.

ఈ పాటను వెండితెరపై ఎలా చూపెడతారా.. అని అభిమానులు ఎంతో ఆసక్తిగా చూస్తున్నారు. ఇక ఈ సినిమాలో బాలకృష్ణతో పాటు ప్రగ్యా జైస్వాల్, శ్రద్ధా శ్రీనాథ్, చాందిని చౌదరి, బాబీ డియోల్ తదితరులు ఇతర ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని నాగవంశీ, సాయి సౌజన్య ప్రొడ్యూస్ చేస్తున్నారు.

వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి

సంబంధిత సమాచారం

తాజా వార్తలు