‘డాకు మహారాజ్’ మాస్ వేటకు రంగం సిద్ధం!

గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘డాకు మహారాజ్’ ఇప్పటికే ప్రేక్షకుల్లో సాలిడ్ అంచనాలు క్రియేట్ చేసింది. ఈ సినిమాను దర్శకుడు బాబీ డైరెక్ట్ చేస్తుండగా పూర్తి యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా ఈ సినిమాతో బాలయ్య బాక్సాఫీస్ దగ్గర సెన్సేషన్ క్రియేట్ చేసేందుకు రెడీ అవుతున్నాడు. ఇక ఈ సినిమా నుండి ఇప్పటివరకు రిలీజ్ అయిన కంటెంట్ కూడా ఈ సినిమాపై భారీ అంచనాలను క్రియేట్ చేశాయి.

అయితే, ఈ సినిమాను వరల్డ్‌వైడ్‌గా సంక్రాంతి కానుకగా గ్రాండ్ స్కేల్‌గా రిలీజ్ చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. ఈ సినిమాపై ఓవర్సీస్ ఆడియెన్స్‌లోనూ భారీ హైప్ క్రియేట్ అయ్యింది. ఇక ఓవర్సీస్ అభిమానుల కోసం చిత్ర యూనిట్ ఈ మూవీ టికెట్ బుకింగ్స్‌ను ఓపెన్ చేయబోతున్నట్లు ప్రకటించింది. డిసెంబర్ 20 నుండి ఈ చిత్రానికి సంబంధించిన ఆన్‌లైన్ టికెట్ బుకింగ్స్ ఓపెన్ అవుతుండటంతో అభిమానులు ఈ చిత్రాన్ని తొలిరోజే చూసేందుకు రెడీ అవుతున్నారు.

ఈ సినిమాలో ప్రగ్యా జైస్వాల్, శ్రద్ధా శ్రీనాథ్, చాందిని చౌదరి, బాబీ డియోల్ తదితరులు ఇతర ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. థమన్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రాన్ని నాగవంశీ, సాయి సౌజన్య ప్రొడ్యూస్ చేస్తున్నారు.

Exit mobile version