30 మిలియన్ వ్యూస్‌తో దూసుకెళ్తున్న ‘దావూదీ’

30 మిలియన్ వ్యూస్‌తో దూసుకెళ్తున్న ‘దావూదీ’

Published on Sep 5, 2024 4:04 PM IST

మ్యాన్ ఆఫ్ మాసెస్ జూ.ఎన్టీఆర్ లేటెస్ట్ మూవీ ‘దేవర’ నుంచి తాజాగా వచ్చిన ‘దావూదీ’ సాంగ్ సెన్సేషన్ క్రియేట్ చేస్తుంది. ఈ పాటలో వింటేజ్ తారిక్‌ని చూస్తారని మేకర్స్ ముందు నుంచీ చెబుతు వస్తుండటంతో, ఈ పాట ఎలా ఉంటుందా అని అభిమానులు ఆసక్తిగా చూస్తూ వచ్చారు. ఇక వారు అన్నట్లుగా ఈ పాటలో తారక్ మాస్ డ్యాన్స్‌తో ఫైర్ పుట్టించాడు.

ఈ పాట రిలీజ్ అయిన తక్కువ సమయానికే సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది. తాజాగా ఈ సాంగ్‌కి యూట్యూబ్‌లో ఏకంగా 30 మిలియన్లుకు పైగా వ్యూస్ దక్కాయి. అంతేగాక, ట్రెండింగ్ చార్ట్స్‌లో ఈ సాంగ్ ఫైర్‌లా దూసుకెళ్తోందని మేకర్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఈ పాటలో తారిక్‌తో పాటు జాన్వీ కపూర్ అందాలు, ఆమె చేసిన డ్యాన్స్ కూడా అభిమానులను ఆకట్టుకున్నాయి.

దర్శకుడు కొరటాల శివ డైరెక్షన్‌లో తెరకెక్కిన ఈ సినిమాను ఎన్టీఆర్ ఆర్ట్స్, యువసుధ ఆర్ట్స్ బ్యానర్లు సంయుక్తంగా ప్రొడ్యూస్ చేస్తున్నాయి. ఈ సినిమాలో సైఫ్ అలీ ఖాన్ విలన్ పాత్రలో నటిస్తుండగా, అనిరుధ్ రవిచందర్ సంగీతం అందించాడు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు