సమీక్ష : దక్షిణ – సిల్లీ క్రైమ్ థ్రిల్లర్ !

Dakshina Movie Review in Telugu

విడుదల తేదీ : అక్టోబర్ 04, 2024

123తెలుగు.కామ్ రేటింగ్ : 2.25/5

నటీనటులు : సాయి ధన్షిక, రిషవ్ బసు, స్నేహ సింగ్, అంకిత ములేర్, మాగ్నా చౌదరి, నవీన్, కరుణ, హిమ శైలజ మరియు ఇతరులు.

దర్శకుడు : ఓషో తులసీరామ్.

నిర్మాతలు : అశోక్ షిండే

సంగీత దర్శకుడు : బాలాజీ

సినిమాటోగ్రఫీ : నర్సింగ్

ఎడిటర్ : వినయ్

సంబంధిత లింక్స్: ట్రైలర్

‘కబాలి’ ఫేమ్ సాయి ధన్సిక కథనాయికగా రిషవ్ బసు మరొక ముఖ్య పాత్రలో నటించిన సినిమా “దక్షిణ”. డైరెక్టర్ ఓషో తులసిరామ్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా ఈ రోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ప్రేక్షకులను ఏ మేరకు మెప్పించిందో సమీక్షలోకి వెళ్లి తెలుసుకుందాం !

 

కథ :

దక్షిణ (సాయి ధన్సిక) ఒక సీరియస్ పోలీస్ ఆఫీసర్. సిటీ నాలుగు వైపుల వరుసగా అమ్మాయిల హత్యలు జరుగుతూ ఉంటాయి. ఒకరి తర్వాత ఒకర్ని కిడ్నాప్ చేసి ఆ అమ్మాయిలను అతి కిరాతకంగా తల నరికి చంపుతూ ఉంటాడు ఓ సైకో. అసలు ఆ సైకో ఎవరు ?, ఎందుకు అతను అతి దారుణంగా అమ్మాయిలను చంపుతున్నాడు. ఈ క్రమంలో జరిగిన కొన్ని నాటకీయ పరిణామాలు ఏమిటి ?, ఈ మధ్యలో ‘ఏసీపీ దక్షిణ’ జీవితంలో ఓ దారుణం జరుగుతుంది. ఆ దారుణం చేసిన సైకో పై దక్షిణ ఏ విధంగా ప్రతీకారం తీర్చుకుంది ?, ఈ క్రమంలో దక్షిణ ఎదుర్కొన్న సమస్యలు ఏమిటి ?, చివరకు దక్షిణ సాధించింది ఏమిటి ? అనేది మిగిలిన కథ.

 

ప్లస్ పాయింట్స్ :

ఈ సినిమాలో ప్రధాన పాత్రలో నటించిన ‘కబాలి’ ఫేమ్ సాయి ధన్సిక తన బాడీ లాంగ్వేజ్ తో అలాగే, కొన్ని ఎమోషనల్ అండ్ క్రైమ్ సీక్వెన్స్ స్ లో చాలా బాగా నటించింది. ప్రధానంగా కొన్ని కీలక సన్నివేశాల్లో తన తన పర్ఫార్మెన్స్‌తో సాయి ధన్సిక ప్రేక్షకులను సర్‌ప్రైజ్ చేసింది. మరో ప్రధాన పాత్రలో నటించిన రిషవ్ బసు కూడా చాలా బాగా నటించాడు. ముఖ్యంగా క్లైమాక్స్ లో రిషవ్ బసు నటన చాలా బాగుంది. సీరియస్ క్రైమ్ సన్నివేశాల్లోని అతని నటన సినిమాకే హైలైట్ గా నిలిచింది.

ఇక సాయి ధన్సిక క్యారెక్టర్ పాయింట్ ఆఫ్ వ్యూలో వచ్చే ఫ్లాష్ బ్యాక్ కూడా బాగానే ఉంది. అదేవిధంగా దర్శకుడు ఓషో తులసీరామ్ అమ్మాయిల హత్యల చుట్టూ అనేక కోణాల్లో సినిమాని నడిపిన విధానం కొన్ని చోట్ల బాగుంది. సుభాష్, ఆనంద భారతి తదితరులతో పాటు ఇతర పాత్రల్లో నటించిన నటీనటులు కూడా తమ పాత్రల్లో ఒదిగిపోయారు. అన్నట్టు ‘సినిమా మొదటి సన్నివేశం’ సినిమా పై ఆసక్తిని పెంచింది.

 

మైనస్ పాయింట్స్:

ఈ దక్షిణ సినిమాలో ఇంట్రెస్టింగ్ క్రైమ్ డ్రామా ఉన్నా.. కొన్ని చోట్ల ప్లే మాత్రం చాలా సింపుల్ గా సాగుతుంది. ఫస్ట్ హాఫ్ లో చాలా సీన్స్ బోర్ గా సాగాయి. ఫస్ట్ హాఫ్ ను ఇంకా బలంగా రాసుకుని ఉండాల్సింది. దీనికితోడు, అనవసరమైన ల్యాగ్ సీన్స్ కూడా ఎక్కువైపోయాయి. పైగా ఈ సినిమా స్లో నేరేషన్ తో పాటు బోరింగ్ ట్రీట్మెంట్ అండ్ ఫేక్ ఎమోషన్స్ తో సాగుతుంది.

అసలు ఒక ఏసీపీ పై అంత తేలిగ్గా అఘాయిత్యం ఎలా చేయగలడు ?, సినిమా మొత్తం ఈ పాయింట్ చుట్టే తిరిగింది కాబట్టి, ఈ పాయింట్ ను ఇంకా బలంగా డిటైల్డ్ గా ఎస్టాబ్లిష్ చేసి కన్వెన్స్ చేయాల్సింది. మొత్తానికి ఫస్ట్ హాఫ్ లో కొన్ని కీలక సీన్స్ మరియు ఇంటర్వెల్ సీన్ మినహా మిగతా సీన్స్ ఆకట్టుకోవు. ఇక సెకండాఫ్ ని కాస్త ఎమోషనల్ గా నడుపుదామని దర్శకుడు ఓషో తులసీరామ్ బాగానే ప్రయత్నం చేశాడు, కాకపోతే పూర్తి స్థాయిలో ఎక్కడా ఆ ఎమోషన్ వర్కౌట్ కాలేదు.

పైగా సిల్లీ ఎమోషన్స్ చుట్టూ పేలవమైన సీన్స్ తో సినిమాని సాగదీశారు. మొత్తమ్మీద ఈ దక్షిణ మూవీ మేకర్స్ తాము అనుకున్న కంటెంట్ ను స్క్రీన్ మీద బాగా ఎలివేట్ చేసినా.. కొన్ని సీన్స్ విషయంలో బాగాలేదు. అలాగే క్లైమాక్స్ లోని సీన్స్ కూడా ఆకట్టుకోవు.

 

సాంకేతిక విభాగం :

సాంకేతిక విభాగం గురించి మాట్లాడుకుంటే.. దర్శకుడు ఓషో తులసీరామ్ మంచి క్రైమ్ థ్రిల్లర్స్ కి గుడ్ ట్రీట్మెంట్ ను యాడ్ చేసి ఇంట్రెస్ట్ పెంచలేకపోయారు. ప్లే ఇంకొంచెం బెటర్ గా రాసుకొని ఉండాల్సింది. సినిమాలో నర్సింగ్ సినిమాటోగ్రఫీ బాగుంది. మూవీ ఓపెనింగ్ దృశ్యాలతో పాటు సెకండ్ హాఫ్ లో వచ్చే కొన్ని కీలక సన్నివేశాలను కెమెరామెన్ చాలా నేచురల్ గా చూపించారు. బాలాజీ సంగీతం బాగుంది. నేపథ్య సంగీతం కూడా పర్వాలేదు. ఎడిటింగ్ ఇంకా బెటర్ ఉంటే సినిమాకి ప్లస్ అయ్యేది. నిర్మాత అశోక్ షిండే ప్రొడక్షన్ వాల్యూస్ కూడా బాగున్నాయి.

 

తీర్పు :

‘దక్షిణ’ అంటూ వచ్చిన ఈ ఎమోషనల్ క్రైమ్ మిస్టరీ డ్రామా ఆకట్టుకోలేదు. కొన్ని క్రైమ్ సీన్స్ అండ్ ఫస్ట్ సీక్వెన్స్ బాగున్నప్పటికీ.. స్క్రీన్ ప్లే స్లోగా సాగడం, ఫస్ట్ హాఫ్ లో ఇంట్రెస్టింగ్ సీన్స్ లేకపోవడం, కొన్ని కీలక సన్నివేశాల్లో లాజిక్ మిస్ కావడం వంటి అంశాలు సినిమాకి మైనస్ అయ్యాయి. మొత్తమ్మీద ఈ క్రైమ్ యాక్షన్ డ్రామా ప్రేక్షకులను పూర్తి స్థాయిలో అలరించలేకపోయింది.

123telugu.com Rating: 2.25/5

Reviewed by 123telugu Team

Click Here For English Review

Exit mobile version