లేటెస్ట్…”డార్లింగ్” ట్రైలర్ కి డేట్ ఫిక్స్!

టాలీవుడ్ నటుడు, కమెడియన్ ప్రియదర్శి ప్రధాన పాత్రలో, నభా నటేష్ ఫీమేల్ లీడ్ రోల్ లో నటిస్తున్న లేటెస్ట్ కామెడీ ఎంటర్టైనర్ డార్లింగ్. ఈ చిత్రంను అనౌన్స్ చేసినప్పటి నుండి ప్రేక్షకుల్లో ఆసక్తి నెలకొంది. హనుమాన్‌ చిత్రాన్ని నిర్మించిన నిరంజన్‌రెడ్డి ఈ డార్లింగ్‌ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. అశ్విన్ రామ్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం ను జూలై 19, 2024 న వరల్డ్ వైడ్ గా థియేటర్ల లో రిలీజ్ చేసేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు. ఇప్పటికే ఈ చిత్రం నుండి రిలీజైన ప్రచార చిత్రాలకి ప్రేక్షకుల నుండి మంచి రెస్పాన్స్ వచ్చింది.

తాజాగా ఈ చిత్రం ట్రైలర్ రిలీజ్ డేట్ పై మేకర్స్ క్లారిటీ ఇచ్చారు. ఈ చిత్రం ట్రైలర్ ను జూలై 7 వ తేదీన రిలీజ్ చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. ఇదే విషయాన్ని వెల్లడించడానికి సరికొత్త పోస్టర్ ను విడుదల చేయడం జరిగింది. పోస్టర్ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది. ఆడియెన్స్ ను విశేషంగా ఆకట్టుకుంటుంది. అనన్య నాగళ్ల కీలక పాత్రలో నటిస్తున్న ఈ చిత్రానికి వివేక్ సాగర్ సంగీతం అందిస్తుండగా, హేమంత్ డైలాగ్ రైటర్ గా వ్యవహరిస్తున్నారు. ఈ చిత్రం కి సంబందించిన మరిన్ని వివరాలు త్వరలో వెల్లడి కానున్నాయి.

Exit mobile version