రిలీజ్ కి ముందుగానే పెయిడ్ ప్రీమియర్ షో తో “డార్లింగ్”

రిలీజ్ కి ముందుగానే పెయిడ్ ప్రీమియర్ షో తో “డార్లింగ్”

Published on Jul 16, 2024 10:28 PM IST

టాలీవుడ్ నటుడు, కమెడియన్ ప్రియదర్శి మరియు నభా నటేష్ ప్రధాన జంటగా నటించిన రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్ డార్లింగ్. జూలై 19, 2024న థియేటర్లలోకి రానున్న ఈ చిత్రంపై ప్రేక్షకుల్లో ఆసక్తి నెలకొంది. అశ్విన్ రామ్ ఈ కామెడీ ఎంటర్టైనర్ కి దర్శకత్వం వహించారు. ఇప్పటికే ఈ చిత్రం నుండి రిలీజైన ప్రచార చిత్రాలకి మంచి రెస్పాన్స్ వచ్చింది. రిలీజ్ ట్రైలర్ కూడా ఆడియెన్స్ ను విశేషం గా ఆకట్టుకుంటుంది. ఔట్ అండ్ ఔట్ కామెడీ ఎంటర్టైనర్ గా సూచిస్తుంది.

అయితే కంటెంట్ మీద ఉన్న కాన్ఫిడెంట్ తో మేకర్స్ సినిమాను ఒక రోజు ముందుగానే పెయిడ్ ప్రీమియర్ ద్వారా ప్రేక్షకుల ముందుకు తీసుకు వస్తున్నారు. శ్రీ రాములు ధియేటర్, మూసాపేట్ లో జూలై 18 వ తేదీన సాయంత్రం 6:30 గంటలకు ఈ ప్రీమియర్ షో ప్రారంభం కానుంది. అందుకు సంబంధించిన అడ్వాన్స్ బుకింగ్స్ ను స్టార్ట్ చేశారు. అనన్య నాగళ్ల, మోయిన్, శివా రెడ్డి, మురళీధర్ గౌడ్, బ్రహ్మానందం, కళ్యాణి రాజ్ తదితరులు కీలక పాత్రల్లో నటించిన ఈ చిత్రాన్ని ప్రైమ్‌షో ఎంటర్టైన్మెంట్ బ్యానర్‌ పై కె. నిరంజన్ రెడ్డి మరియు చైతన్య రెడ్డి నిర్మించారు. ఈ చిత్రానికి వివేక్ సాగర్ సంగీతం అందించారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు