‘నారీ నారీ నడుమ మురారి’ నుండి రొమాంటిక్ మెలోడీ ‘దర్శనమే’ సాంగ్ రిలీజ్

‘నారీ నారీ నడుమ మురారి’ నుండి రొమాంటిక్ మెలోడీ ‘దర్శనమే’ సాంగ్ రిలీజ్

Published on Apr 9, 2025 6:03 PM IST


చార్మింగ్ స్టార్ శర్వానంద్, అందాల భామలు సంయుక్త మీనన్, సాక్షి వైద్య హీరోహీరోయిన్లుగా నటిస్తున్న లేటెస్ట్ చిత్రం ‘నారీ నారీ నడుమ మురారి’ ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. ఈ సినిమాను దర్శకుడు రామ్ అబ్బరాజు డైరెక్ట్ చేయగా, భాను బోగవరపు ఈ చిత్రానికి కథను అందిస్తున్నాడు. ఇక ఈ సినిమా నుంచి ఇప్పటికే రిలీజ్ అయిన పోస్టర్స్ ఈ మూవీపై మంచి బజ్ క్రియేట్ చేశాయి.

తాజాగా ఈ సినిమాలోని ఫస్ట్ సింగిల్ సాంగ్ ‘దర్శనమే’ లిరికల్ వీడియోను మేకర్స్ రిలీజ్ చేశారు. రామజోగయ్య శాస్త్రి రాసిన ఈ పాటను విశాల్ చంద్రశేఖర్ రొమాంటిక్ మెలోడీ ట్యూన్స్‌తో అదరగొట్టాడు. ఇక యాజిన్ నిజార్ తన వాయిస్‌తో ఈ పాటకు మరింత అందాన్ని తీసుకొచ్చాడు. ఇక ఈ పాటను తెరకెక్కించిన తీరు ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. ఇందులో శర్వానంద్, సంయుక్త మధ్య కెమిస్ట్రీ ఆడియెన్స్‌కు రిఫ్రెషింగ్‌గా కనిపిస్తోంది.

ఇక ఈ సినిమాను అన్ని వర్గాల ప్రేక్షకులు మెచ్చే విధంగా తెరకెక్కిస్తున్నారు చిత్ర యూనిట్. ఈ సినిమాను ఏకె.ఎంటర్‌టైన్‌మెంట్స్, అడ్వెంచర్స్ ఇంటర్నేషనల్ ప్రై.లిమిటెడ్ బ్యానర్‌పై అనిల్ సుంకర, రామబ్రహ్మం సుంకర సంయుక్తంగా ప్రొడ్యూస్ చేస్తున్నారు.

వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి

సంబంధిత సమాచారం

తాజా వార్తలు