హీరోయిన్ పవిత్ర గౌడకు అసభ్య సందేశాలు పంపిన యువకుడిని హత్య చేశారనే ఆరోపణలపై కన్నడ స్టార్ హీరో దర్శన్ అరెస్టయిన సంగతి తెలిసిందే. ఐతే, అరెస్టయిన దర్శన్ కు కచ్చితంగా బెయిల్ వస్తుందని టాక్ నడిచింది. దీంతో, దర్శన్ అభిమానులు బాణసంచా కాల్చడానికి కూడా ఏర్పాట్లు చేసుకున్నారు. ఐతే, దర్శన్ కు బెయిల్ మాత్రం రాలేదు. దీంతో, దర్శన్ అభిమానులకు మళ్లీ నిరాశ ఎదురైంది. ఇంతకీ, దర్శన్ కు బెయిల్ వస్తోందా ? రాదా ?, ఇదే విషయం పై ఆయన ఫ్యాన్స్ చర్చ మొదలుపెట్టారు.
మరోవైపు దర్శన్ బెయిల్ పై విచారణను కోర్టు 8వ తేదీకి వాయిదా వేసింది. ప్రస్తుతం బళ్లారి జైలులో దర్శన్ ఉన్నాడు. జైల్లో అతనికి రాచమర్యాదలు లభిస్తున్నట్లు ఇప్పటికే వార్తలు వినిపించాయి. పైగా ఆ మధ్య ఓ ఫోటో కూడా లీక్ అయ్యింది. అన్నట్టు ఈ హత్య కేసులో మొత్తం 17 మందిని అరెస్ట్ చేశారు. అందులో ఏ-15, ఏ-16, ఏ-17కు ఇప్పటికే బెయిల్ రావడం జరిగింది. దర్శన్ ఏ-2గా ఉన్నాడు కాబట్టి, బెయిల్ వస్తోందా ? రాదా ? అనేది డౌట్ గా మారింది.