‘ప‌ర‌దా’ మూవీలో మ‌రో మ‌ల‌యాళ బ్యూటీ

‘ప‌ర‌దా’ మూవీలో మ‌రో మ‌ల‌యాళ బ్యూటీ

Published on Jun 17, 2024 11:30 AM IST


అందాల భామ అనుప‌మ ప‌ర‌మేశ్వ‌ర‌న్ లీడ్ రోల్ లో న‌టిస్తున్న తాజా చిత్రం ‘ప‌రదా’ ఇప్ప‌టికే శ‌ర‌వేగంగా షూటింగ్ జ‌రుపుకుంటోంది. ఈ సినిమాను ప్ర‌వీణ్ కాండ్రేగుల డైరెక్ట్ చేస్తుండ‌గా, ఇప్ప‌టికే ఈ మూవీ ఫ‌స్ట్ లుక్ పోస్ట‌ర్ ఆడియెన్స్ ను ఆక‌ట్టుకుంది. దీంతో ఈ సినిమా ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అభిమానులు ఆస‌క్తిగా చూస్తున్నారు.

ఈ సినిమా నుండి తాజాగా ఓ ఇంట్రెస్టింగ్ అప్డేట్ ఇచ్చారు మేక‌ర్స్. ఈ మూవీలో మ‌రో మ‌లయాళ భామ ద‌ర్శ‌న రాజేంద్ర‌న్ నటిస్తున్న‌ట్లు వారు అనౌన్స్ చేశారు. ఈ మేర‌కు ఓ వీడియోను రిలీజ్ చేశారు. అమిష్త అనే పాత్ర‌లో ద‌ర్శ‌న క‌నిపించ‌నుంది. మ‌ల‌యాళంలో ద‌ర్శ‌న‌ మంచి క్రేజ్ ఉన్న న‌టి. ఇప్పుడు ఆమె తెలుగులో ఎంట్రీ ఇస్తుండ‌టంతో, ఈ సినిమాలో ఆమె పాత్ర ఎలా ఉంటుందా అని ఫ్యాన్స్ ఎదురుచూస్తున్నారు.

ఇక ‘ప‌ర‌దా’ సినిమాను వీలైనంత త్వ‌ర‌గా రిలీజ్ చేసేందుకు మేక‌ర్స్ సిద్ధ‌మ‌వుతున్నారు. ఈ సినిమాను శ్రీధర్‌ మక్కువ, విజయ్‌ డొంకాడ నిర్మిస్తుండ‌గా, గోపీ సుంద‌ర్ ఈ మూవీకి సంగీతాన్ని అందిస్తున్నారు.

వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి

సంబంధిత సమాచారం

తాజా వార్తలు