వరల్డ్ ప్రీమియర్ డేట్ లాక్ చేసుకున్న “దాస్ కా ధమ్కీ”


మన టాలీవుడ్ యంగ్ అండ్ మాస్ హీరో మాస్ కా దాస్ విశ్వక్ సేన్ హీరోగా యంగ్ హీరోయిన్ నివేతా పెత్తురాజ్ హీరోయిన్ గా విశ్వక్ సేన్ దర్శకత్వంలో తెరకేకించిన సాలిడ్ థ్రిల్లర్ డ్రామా “దాస్ కా ధమ్కీ”. ఈ ఏడాది మంచి బజ్ లో రిలీజ్ అయ్యి విశ్వక్ సేన్ కెరీర్ లోనే సెన్సేషనల్ హిట్ అయ్యింది. మరి థియేటర్స్ తర్వాత ఓటిటి లో మంచి రెస్పాన్స్ ని అందుకున్న ఈ చిత్రం ఇప్పుడు ఫైనల్ గా స్మాల్ స్క్రీన్ పై సందడి చేసేందుకు సిద్ధం అయ్యింది.

ఈ సినిమా శాటిలైట్ హక్కులు జీ తెలుగు వారు సొంతం చేసుకోగా అందులో ఈ చిత్రం రేపు నవంబర్ 26 వరల్డ్ ప్రీమియర్ గా అయితే సాయంత్రం 6 గంటలకి ప్రసారం చేస్తున్నట్టుగా ఫిక్స్ చేశారు. మరి ఈ చిత్రానికి ఎలాంటి రెస్పాన్స్ వస్తుందో చూడాలి. ఇక ఈ చిత్రానికి రామ్ మిర్యాల లియోన్ జేమ్స్ సంగీతం అందించగా విశ్వక్ సేన్ కూడా ఈ చిత్రానికి నిర్మాణం వహించాడు.

Exit mobile version