మొదలెట్టి ఏడాదైంది…”దసరా” టీమ్ స్పెషల్ పోస్టర్ రిలీజ్!


ప్రస్తుతం ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూస్తున్న చిత్రం దసరా. నేచురల్ స్టార్ నాని మరియు గార్జియస్ బ్యూటీ కీర్తి సురేష్ ఈ రా అండ్ విలేజ్ యాక్షన్ ఎంటర్టైనర్‌లో ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రం మార్చి 30, 2023న థియేటర్ల లో గ్రాండ్ గా రిలీజ్ కానుంది. ఈ చిత్రానికి శ్రీకాంత్ ఓదెల దర్శకుడు గా వ్యవహరిస్తున్నారు. షూటింగ్ ప్రారంభించి ఏడాది పూర్తయిన సందర్భంగా టీమ్ ఈరోజు స్పెషల్ పోస్టర్‌ను విడుదల చేసింది.

ఇక్కడ పోస్టర్‌లో నాని, కీర్తి సురేష్ మరియు దీక్షిత్ శెట్టి సెలబ్రేట్ మోడ్‌లో ఉన్నారు. ఈ చిత్రానికి సంబంధించిన ప్రమోషన్స్ జోరుగా సాగుతున్నాయి. ఎస్‌ఎల్‌వి సినిమాస్‌ పై సుధాకర్ చెరుకూరి నిర్మించిన ఈ చిత్రానికి సంతోష్ నారాయణన్ స్వరాలు సమకుర్చారు. సాయి కుమార్, షైన్ టామ్ చాకో, దీక్షిత్ శెట్టి, సముద్రఖని, జరీనా వహాబ్ కీలక పాత్రలు పోషిస్తున్నారు.

Exit mobile version