పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా ఇపుడు చేస్తున్న లేటెస్ట్ చిత్రాల్లో దర్శకుడు జ్యోతి కృష్ణ తెరకెక్కిస్తున్న భారీ పాన్ ఇండియా పీరియాడిక్ చిత్రం “హరిహర వీరమల్లు” కూడా ఒకటి. నిజానికి ఓజి సినిమా కంటే ముందు దీనిపై ఉన్న హైప్ అంతా ఇంతా కాదు. పవన్ కళ్యాణ్ నుంచి మొదటి వారియర్ బ్యాక్ డ్రాప్ సినిమా ఇది కాగా అనౌన్స్ చేసి గ్లింప్స్ నుంచే భారీ హైప్ ఉంది.
అయితే ఇపుడు షూటింగ్ దాదాపు దాదాపు పూర్తి కావస్తుండగా చాలా రోజుల నుంచి అవైటెడ్ గా చూస్తున్న ఫస్ట్ సింగిల్ పై ఇపుడు ఓ క్లారిటీ అయితే వచ్చింది. నేడు సంక్రాంతి కానుకగా ఒక బ్యూటిఫుల్ ప్రోమో కట్ తో మేకర్స్ డేట్ అలాగే సినిమా సమయాన్ని కూడా ఖరారు చేశారు. ఇక దీనితో ఈ అవైటెడ్ స్పెషల్ సాంగ్ అది కూడా పవన్ పాడిన మాట వినాలి సాంగ్ ఈ జనవరి 17న ఉదయం 10 గంటల 20 నిమిషాలకి రిలీజ్ చేస్తున్నట్టుగా కన్ఫర్మ్ చేశారు. ఇక ఈ చిత్రానికి ఎం ఎం కీరవాణి సంగీతం అందిస్తుండగా ఏ ఎం రత్నం భారీ బడ్జెట్ తో నిర్మాణం వహిస్తున్నారు.
ప్రోమో కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి