మెగాస్టార్, నాగ్, అమీర్ ల అదిరే ఇంటర్వ్యూ టెలికాస్ట్ కి డేట్ ఫిక్స్.!

మెగాస్టార్, నాగ్, అమీర్ ల అదిరే ఇంటర్వ్యూ టెలికాస్ట్ కి డేట్ ఫిక్స్.!

Published on Aug 3, 2022 4:00 PM IST

ప్రస్తుతం పాన్ ఇండియా లెవెల్లో మంచి అంచనాలు నెలకొల్పుకొని రిలీజ్ కి వస్తున్న అవైటెడ్ చిత్రాల్లో బాలీవుడ్ భారీ చిత్రం “లాల్ సింగ్ చడ్డా” కూడా ఒకటి. బాలీవుడ్ మిస్టర్ పర్ఫెక్షనిస్ట్ అమీర్ ఖాన్ హీరోగా కరీనా కపూర్ ఖాన్ హీరోయిన్ గా అలాగే అక్కినేని నాగ చైతన్య మరో కీలక పాత్రలో నటించిన ఈ చిత్రంపై ఓవరాల్ గా మంచి బజ్ నెలకొంది.

మరి ఈ సినిమాని తెలుగులో మెగాస్టార్ చిరంజీవి ప్రెజెంట్ చేస్తుండగా అమీర్ స్పెషల్ గా ప్లాన్ చేసిన ప్రీమియర్ కి చిరు సహా నాగ్ లు హాజరయ్యి తమ అద్భుత స్పందనను తెలియజేసారు. మరి దీనితో పాటుగా హైప్ మరింత పెంచే విధంగా తెలుగులో ఓ అదిరే ఇంటర్వ్యూని కూడా మేకర్స్ ప్లాన్ చేశారు.

నాగ్, చిరు అలాగే అమీర్ ఖాన్ ల మధ్య ప్రముఖ ఛానెల్ స్టార్ మా లో ప్లాన్ చేసిన ఈ ఇంటర్వ్యూ నుంచి ఆల్రెడీ పలు ఆసక్తికర ప్రోమోలు టెలికాస్ట్ అవుతున్నాయి. ఇక ఫైనల్ గా అయితే ఈ క్రేజీ ఇంటర్వ్యూ టెలికాస్ట్ కి డేట్ వచ్చేసింది. మరి ఈ “మెగా లాల్ సింగ్ చడ్డా” ఇంటర్వ్యూ ఈ ఆగస్ట్ 7 స్టార్ మా లో రాత్రి 10 గంటల 30 నిమిషాలకి టెలికాస్ట్ చేయనున్నట్టుగా తెలుస్తుంది. మరి ఈ ఇంటర్వ్యూ ఎలా ఉంటుందో చూడాలి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు