మరోసారి బాలయ్య షోలో చంద్రబాబు.. స్ట్రీమింగ్ డేట్, టైం ఫిక్స్..

మన తెలుగు ప్రముఖ స్ట్రీమింగ్ యాప్ ఆహా కోసం అందరికీ తెలిసిందే. మరి ఇందులో తెలుగులోనే ఒరిజినల్ కంటెంట్ ని అందిస్తూ వస్తున్నారు. అయితే అందులో చాలానే టాక్ షోలు వచ్చాయి కానీ ఈ షోస్ లో లయన్ బాలయ్యతో స్టార్ట్ చేసిన క్రేజీ టాక్ షో “అన్ స్టాప్పబుల్” కూడా ఒకటి. మరి సినీ ప్రముఖులతో మంచి ఎంటర్టైనింగ్ గా సాగే ఈ షో మొత్తం మూడు సీజన్లని పూర్తి చేసుకొని ఇపుడు నాలుగో సీజన్లోకి ఎంటర్ అయ్యింది.

అయితే రీసెంట్ గానే వచ్చిన ప్రోమో కూడా అదిరిపోగా ఇప్పుడు మొదటి ఎపిసోడ్ పై అఫీషియల్ క్లారిటీ వచ్చేసింది. ఈ సీజన్లో మొదటి ఎపిసోడ్ ని కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పైనే ప్లాన్ చేయగా ఇప్పుడు కొన్ని షూటింగ్ తాలూకా పిక్స్ కూడా వైరల్ గా మారాయి.

మరి నేడు షూటింగ్ జరుపుకుంటున్న ఈ ఎపిసోడ్ ఎప్పుడు ప్రసారం అవుతుంది అనేది కూడా కన్ఫర్మ్ అయ్యిపోయింది. దీనితో ఈ ఎపిసోడ్ అయితే ఈ అక్టోబర్ 25న రాత్రి 8 గంటల 30 నిమిషాలకి స్ట్రీమింగ్ కానుందట. మరి ఈ ఎపిసోడ్ పొలిటికల్ సహా మంచి ఎంటర్టైనింగ్ గా ఉండబోతుంది అని తెలుస్తుంది.

Exit mobile version