దర్శకుడు ప్రశాంత్ వర్మ ‘హను-మాన్’ సినిమాతో ఎలాంటి క్రేజ్‌ను దక్కించుకున్నాడో అందరికీ తెలిసిందే. ఈ సినిమాతో ఆయన ఒక్కసారిగా పాన్ ఇండియా డైరెక్టర్ అయిపోయాడు. ఇక ఈ డైరెక్టర్ ప్రస్తుతం తన నెక్స్ట్ ప్రాజెక్ట్‌ని అనౌన్స్ చేసి అందరిలో ఆసక్తిని క్రియేట్ చేశాడు. ‘సింబ’ అనే సినిమాతో ప్రశాంత్ వర్మ మనముందుకు రాబోతున్నట్లు తాజాగా వెల్లడించాడు.
ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్‌లో భాగంగానే ఈ సినిమా కూడా ఉండబోతుందని ఆయన తెలిపాడు. ఇక ఈ సినిమాలో నందమూరి బాలకృష్ణ తనయుడు మోక్షజ్ఞ సినీ ఎంట్రీ ఇవ్వబోతున్నట్లుగా టాక్ జోరుగా వినిపిస్తోంది. అయితే, దీనిపై ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది. ఇక ఈ సినిమాకు సంబంధించిన అఫీషియల్ అనౌన్స్‌మెంట్ సెప్టెంబర్ 6న ఉదయం 10.36 గంటలకు చేయబోతున్నట్లు ప్రశాంత్ వర్మ తాజాగా ప్రకటించారు. అంతేగాక, ‘‘లెగసీని ముందుకు తీసుకెళ్లే సమయం ఆసన్నమైంది’’ అంటూ ప్రశాంత్ వర్మ ఓ క్లూ కూడా వదిలాడు.
దీంతో ఈ సినిమాలో మోక్షజ్ఞ తెరంగేట్రం దాదాపు ఖాయం అని నందమూరి అభిమానులు ఫిక్స్ అవుతున్నారు. ఈ సినిమా SLV సినిమాస్ బ్యానర్‌పై చెరుకూరి సుధాకర్ ప్రొడ్యూస్ చేయనున్నారని తెలుస్తోంది.