నాగ్ “ది ఘోస్ట్” గ్రాండ్ ప్రీ రిలీజ్ పై డీటెయిల్స్ వచ్చేశాయ్.!

Published on Sep 21, 2022 6:44 pm IST

అక్కినేని నాగార్జున హీరోగా యంగ్ బ్యూటీ సోనాల్ చౌహన్ హీరోయిన్ గా నటించిన లేటెస్ట్ సాలిడ్ యాక్షన్ డ్రామా “ది ఘోస్ట్” కోసం అందరికీ తెలిసిందే. నాగ్ కెరీర్ లో మంచి హైప్ తో వస్తున్న చిత్రం ఇది కాగా దీనిని అయితే టాలెంటెడ్ దర్శకుడు ప్రవీణ్ సత్తారు తెరకెక్కించారు. మరి ఇప్పటి వరకు అయితే మంచి బజ్ తో సిద్ధంగా ఉన్న సినిమాపై మేకర్స్ లేటెస్ట్ గా ఓ ఇంట్రెస్టింగ్ అప్డేట్ అయితే ఇచ్చారు.

ఈ చిత్రం ప్రీ రిలీజ్ పై ఇప్పుడు సమాచారం ఇస్తూ ఈ సెప్టెంబర్ 25న కర్నూల్ లో ఈ సినిమా గ్రాండ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ ని ప్లాన్ చేసినట్టుగా అనౌన్స్ చేసారు. మరి ఈ ఈవెంట్ అయితే అక్కడ ఎస్ టి బి సి గ్రౌండ్ లో ఆ రోజు సాయంత్రం నుంచి స్టార్ట్ కానుంది.

ఇక ఈ గ్రాండ్ ఈవెంట్ కి అయితే సినిమా యూనిట్ అంతా హాజరు కానుండగా ఈ అప్డేట్ అభిమానులకి మంచి కిక్ ఇస్తుంది. ఇక ఈ చిత్రానికి అయితే మార్క్ కే రాబిన్ సంగీతం అందివ్వగా శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్ ఎల్ పి మరియు నార్త్ స్టార్ ఎంటర్టైన్మెంట్స్ వారు భారీ బడ్జెట్ తో సినిమాని తెరకెక్కించారు.

సంబంధిత సమాచారం :