కోలీవుడ్ లో భారీ స్టార్డం ఉన్న హీరోస్ లో థలా అజిత్ కుమార్ కూడా ఒకరు. మరి అజిత్ హీరోగా నటిస్తున్న లేటెస్ట్ అవైటెడ్ సినిమానే “గుడ్ బ్యాడ్ అగ్లీ”. తన ఫ్యాన్ దర్శకుడు అధిక్ రవీంద్రన్ తెరకెక్కించిన ఈ చిత్రంపై అజిత్ కెరీర్లోనే భారీ హైప్ ని సెట్ చేసుకుంది. మెయిన్ గా అజిత్ నుంచి మిస్ అవుతున్న డార్క్ స్వాగ్ ని అభిమానులకి ఓ రేంజ్ లో తాను ప్రెజెంట్ చేస్తుండగా టీజర్ తోనే సాలిడ్ బజ్ ఈ సినిమాకి వచ్చేసింది.
ఇక ఈ చిత్రం నుంచి అవైటెడ్ గా ఫస్ట్ సింగిల్ ని ఊరిస్తుండగా ఈ మాస్ ట్రీట్ కి ఇపుడు డేట్ వచ్చేసింది. దీనితో ఈ సినిమా ఫస్ట్ సింగిల్ గా ఓజి సంభవం అంటూ మార్చ్ 18న రిలీజ్ చేస్తున్నట్టుగా తెలిపారు. ఇక ఈ చిత్రానికి జివి ప్రకాష్ సంగీతం అందిస్తుండగా తాను ఈ సాంగ్ పై మంచి అంచనాలు ఉన్నాయి. మరి ఈ సాంగ్ ఎలా ఉంటుందో చూడాల్సిందే. ఇక ఈ చిత్రానికి మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణం వహిస్తుండగా తెలుగు సహా తమిళ్ లో ఈ ఏప్రిల్ 10న గ్రాండ్ గా రిలీజ్ కాబోతుంది.
Here is the making of #GoodBadUglyTeaser ❤️????
▶️ https://t.co/ird2NG1TPJAfter Teaser Sambavam, it is time for the first single. Ready, Maamey?#OGSambavam from March 18th.
A @gvprakash Musical ❤️????#GoodBadUgly Grand release on 10th April, 2025 with VERA LEVEL entertainment ???? pic.twitter.com/HrJnAN9WuJ
— GoodBadUgly (@GoodBadUglyoffl) March 14, 2025