యంగ్ హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘BSS12’ అనే వర్కింగ్ టైటిల్‌తో తెరకెక్కుతోంది. ఈ సినిమాను దర్శకుడు లుధీర్ బైరెడ్డి డైరెక్ట్ చేస్తున్నాడు. పూర్తి అడ్వెంచర్ మూవీగా ఈ చిత్రాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నారు. ఇక ఈ సినిమా షూటింగ్ ఇప్పటికే శరవేగంగా పూర్తి చేసుకుంటున్న సంగతి తెలిసిందే.
అయితే, ఈ సినిమా నుంచి మేకర్స్ తాజాగా సాలిడ్ అప్డేట్ అయితే ఇచ్చారు. BSS12 మూవీకి సంబంధించిన టైటిల్, గ్లింప్స్‌ను జనవరి 8న సాయంత్రం 4.05 గంటలకు రిలీజ్ చేయబోతున్నట్లు చిత్ర యూనిట్ తెలిపింది. మునుపెన్నడూ చూడని అడ్వెంచరస్ సీక్వెన్స్‌లతో ఈ మూవీ ప్రేక్షకులను థ్రిల్ చేయడం ఖాయమని మేకర్స్ కాన్ఫిడెంట్‌గా చెబుతున్నారు.
ఇక ఈ సినిమాలో అందాల భామ సంయుక్త మీనన్ హీరోయిన్‌గా నటిస్తుండగా ఈ చిత్రానికి లియోన్ జేమ్స్ సంగీతం అందిస్తున్నారు. ఈ సినిమాను మూన్‌షైన్ పిక్చర్స్ బ్యానర్‌పై మహేష్ చందు ప్రొడ్యూస్ చేస్తున్నారు.
Every quest has a beginning.
And this one will leave you spellbound ❤️????#BSS12 TITLE & GLIMPSE will strike your screens on January 8th, 4:05 PM ????@BSaiSreenivas @iamsamyuktha_ #MaheshChandu @saishashank4u @ludheerbyreddy @leon_james @Dsivendra @karthikaSriniva @Moonshine_Pctrs pic.twitter.com/bZ5tcgtWcY— Moonshine Pictures (@Moonshine_Pctrs) January 7, 2025