“డాకు మహారాజ్” ఫస్ట్ సింగిల్ డేట్ ఫిక్స్..


నందమూరి నటసింహం బాలకృష్ణ హీరోగా దర్శకుడు కొల్లి బాబీతో చేస్తున్న భారీ చిత్రం “డాకు మహారాజ్” కోసం అందరికీ తెలిసిందే. మరి ఎన్నో అంచనాలు సెట్ చేసుకున్న ఈ చిత్రం కోసం ఫ్యాన్సంతా ఎప్పుడు నుంచో చాలా ఎగ్జైటెడ్ గా ఎదురు చూస్తున్నారు. అయితే ఈ సినిమాతో ఉన్న సంక్రాంతి సినిమాలు నుంచి ఆల్రెడీ ఫస్ట్ సింగిల్స్ వచ్చేసాయి కానీ ఈ చిత్రానికి మాత్రం రాలేదు. మరి ఫైనల్ గా మేకర్స్ దీని డేట్ అయితే ఇచ్చేసారు.

లేటెస్ట్ అప్డేట్ ప్రకారం ఈ సాంగ్ ని మేకర్స్ డిసెంబర్ 14న రిలీజ్ చేస్తున్నట్టుగా అనౌన్స్ చేసేసారు. అలాగే ఇదొక పవర్ఫుల్ ట్రాక్ అంటూ కూడా తెలిపారు. ఇక దీనికి సంబంధించిన ప్రోమోని రేపు డిసెంబర్ 13 ఉదయం 10 గంటల 8 నిమిషాలకి వదలబోతున్నట్టుగా తెలిపారు. మరి బాలయ్యకి థమన్ ఎలాంటి సంగీతం అందించాడో తెలిసిందే. దీనితో డాకు మహారాజ్ ఆల్బమ్ పై కూడా సాలిడ్ హైప్ ఉంది. మరి ఈ అవైటెడ్ ఫస్ట్ సింగిల్ ఎలా ఉంటుందో చూడాలి.

Exit mobile version