‘డాకు మహారాజ్’ సెకండ్ సాంగ్‌కు డేట్ ఫిక్స్

‘డాకు మహారాజ్’ సెకండ్ సాంగ్‌కు డేట్ ఫిక్స్

Published on Dec 19, 2024 6:04 PM IST

గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘డాకు మహారాజ్’ కోసం ప్రేక్షకులు ఎంత ఆసక్తిగా ఎదురుచూస్తున్నారో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఈ సినిమాను దర్శకుడు కొల్లి బాబీ డైరెక్ట్ చేస్తుండగా పక్కా మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా ఈ మూవీ ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమవుతోంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజ్ అయిన పోస్టర్స్, టీజర్, ఫస్ట్ సింగిల్ సాంగ్ ఈ మూవీపై అంచనాలను అమాంతం పెంచేశాయి.

ఇక ఈ సినిమా నుంచి రెండో సింగిల్ సాంగ్‌కు సంబంధించిన అప్డేట్‌ను మేకర్స్ తాజాగా వెల్లడించారు. ఈ మూవీలోని రెండో సాంగ్‌గా ‘చిన్ని’ అనే మెలోడీ సాంగ్ రాబోతుందని.. ఈ పాటను డిసెంబర్ 23న రిలీజ్ చేయబోతున్నట్లు చిత్ర యూనిట్ తెలిపింది. ఈ మేరకు ఓ పోస్టర్‌ను కూడా రిలీజ్ చేశారు. ఈ పోస్టర్‌లో బాలకృష్ణ ఓ చిన్నారిని స్కూల్‌కు తీసుకెళ్తున్నట్లు చూపెట్టారు.

దీంతో ఈ సినిమాలోనూ ఎమోషన్‌కు కొదువ లేదని అభిమానులు ఫిక్స్ అవుతున్నారు. ఇక ఈ సినిమాలో బాలీవుడ్ నటుడు బాబీ డియోల్ విలన్ పాత్రలో నటిస్తుండగా అందాల భామలు ప్రగ్యా జైస్వాల్, శ్రద్ధా శ్రీనాథ్, చాందిని చౌదరి ఇతర ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. థమన్ ఈ చిత్రానికి సంగీతం అందించగా.. నాగవంశీ, సాయి సౌజన్య ఈ మూవీని ప్రొడ్యూస్ చేస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు