Devara: ‘దేవర’ ప్రీ-రిలీజ్ ఈవెంట్ డేట్ ఫిక్స్..!

నందమూరి అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ లేటెస్ట్ సెన్సేషన్ ‘దేవర’(Devara) మరో వారం రోజుల్లో థియేటర్లలో రిలీజ్ కానుంది. ఈ సినిమాను దర్శకుడు కొరటాల ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించాడు. ఇక ఈ సినిమాకు సంబంధించిన ప్రమోషన్స్ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి.

ఇందులో భాగంగా దేవర ప్రీ-రిలీజ్ ఈవెంట్ కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా చూస్తున్నారు. అయితే, ఈ మూవీ గ్రాండ్ ప్రీ-రిలీజ్ ఈవెంట్‌కు డేట్ ఫిక్స్ చేశారు మేకర్స్. సెప్టెంబర్ 22న దేవర ప్రీ-రిలీజ్ ఈవెంట్ జరగనుందని వారు తెలిపారు.

అయితే, ఈ ప్రీ-రిలీజ్ ఈవెంట్ ఎక్కడ అనేది వారు ఇంకా రివీల్ చేయలేదు. ఇక ‘దేవర’ చిత్రాన్ని పాన్ ఇండియా మూవీగా భారీ స్థాయిలో రిలీజ్ చేయనున్నారు. అనిరుధ్ సంగీతం ఇప్పటికే సెన్సేషన్ క్రియేట్ చేసింది. ఈ సినిమాలో జాన్వీ కపూర్ హీరోయిన్‌గా, సైఫ్ అలీ ఖాన్ విలన్‌గా నటిస్తున్నారు.

Exit mobile version