‘మట్కా’ నుంచి ఫస్ట్ సింగిల్ సాంగ్‌కి డేట్ ఫిక్స్

‘మట్కా’ నుంచి ఫస్ట్ సింగిల్ సాంగ్‌కి డేట్ ఫిక్స్

Published on Oct 13, 2024 2:12 AM IST

మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘మట్కా’ ఇప్పటికే షూటింగ్ పనులు ముగించుకుని పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉంది. ఈ సినిమాను దర్శకుడు కరుణ కుమార్ అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నారు. పూర్తి పీరియాడిక్ యాక్షన్ థ్రిల్లర్‌గా ఈ చిత్రం రానుంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజ్ అయిన పోస్టర్స్, టీజర్‌లకు ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ దక్కింది.

ఇక ఈ చిత్ర టీమ్ దసరా కానుకగా మరో ఇంట్రెస్టింగ్ అప్డేట్‌ను రివీల్ చేశారు. ‘మట్కా’ సినిమా నుండి ఫస్ట్ సింగిల్ సాంగ్‌గా ‘లే లే రాజా’ అనే పెప్పీ సాంగ్‌ను రిలీజ్ చేయబోతున్నట్లు చిత్ర యూనిట్ తెలిపింది. ఈ పాటలో బాలీవుడ్ బ్యూటీ నోరా ఫతేహి తనదైన స్టెప్పులతో కుర్రకారును అలరించనుంది. ఈ పాటను అక్టోబర్ 14న రిలీజ్ చేస్తున్నట్లు మేకర్స్ తాజాగా ఓ పోస్టర్ ద్వారా వెల్లడించారు.

అందాల భామ మీనాక్షి చౌదరి హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమాకు జివి.ప్రకాశ్ కుమార్ సంగీతం అందిస్తున్నాడు. ఈ చిత్రాన్ని నవంబర్ 14న వరల్డ్‌వైడ్ రిలీజ్ చేసేందుకు మేకర్స్ సిద్ధమయ్యారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు