ఓటిటిలో “గాడ్జిల్లా మైనస్ 1” ఈ వెర్షన్ కి డేట్ ఫిక్స్


గత ఏడాదిలో జపాన్ నుంచి వచ్చిన సెన్సేషనల్ హిట్ చిత్రం అలాగే విజువల్ ఎఫెక్ట్స్ లో ఆస్కార్ ని కూడా అందుకున్న భారీ చిత్రమే “గాడ్జిల్లా మైనస్ 1”. దర్శకుడు తకాషి యమజాకి తెరకెక్కించిన ఈ సై ఫై డ్రామా ఓటిటి రిలీజ్ కోసం ప్రపంచమే ఆసక్తిగా ఎదురు చూసింది. అయితే దీనిని ఫైనల్ గా జపాన్ వెర్షన్ మినహా మిగతా గ్లోబల్ భాషల్లో అయితే దిగ్గజ స్ట్రీమింగ్ సంస్థ నెట్ ఫ్లిక్స్ వారు కొన్నాళ్ల కితం అందుబాటులోకి తీసుకొచ్చారు.

అయితే ఇప్పుడు ఇదే నెట్ ఫ్లిక్స్ లో ఈ భారీ సినిమా మరో వెర్షన్ లో అందుబాటులోకి రావడానికి సిద్ధం అవుతుంది. అయితే ఈసారి నెట్ ఫ్లిక్స్ లో ఈ సినిమా బ్లాక్ అండ్ వైట్ వెర్షన్ లో రానుంది. ఇది ఈ ఆగస్ట్ 1 నుంచి అందుబాటులోకి రానుందట. మరి దీనిని అయితే స్పెషల్ గా డీ కలరైజ్ చేసి రిలీజ్ చేయబోతున్నామని నెట్ ఫ్లిక్స్ వారు తెలుపుతున్నారు. మరి ఈ వెర్షన్ ఎలా అలరిస్తుందో చూడాలి.

Exit mobile version