గుణశేఖర్ “యుఫోరియా” గ్లింప్స్ కి డేట్ ఫిక్స్.!

గుణశేఖర్ “యుఫోరియా” గ్లింప్స్ కి డేట్ ఫిక్స్.!

Published on Oct 2, 2024 3:55 PM IST

మన టాలీవుడ్ లో భారీ సినిమాలు తీసే ఫేమస్ దర్శకుల్లో ప్రముఖ దర్శకుడు గుణశేఖర్ కూడా ఒకరు. కమర్షియల్ అయినా పౌరాణిక, పీరియాడిక్ సినిమాలు అయినా చేయగలిగే గుణశేఖర్ నుంచి ప్రస్తుతం రాబోతున్న మరో ఇంట్రెస్టింగ్ సినిమానే “యుఫోరియా”. అయితే అనౌన్సమెంట్ తోనే ఈసారి ఏదో క్రేజీ ప్రయత్నం చేస్తున్నట్టుగా కనిపించింది. ఇక ఈ సినిమా నుంచి ఇప్పుడు మేకర్స్ మరో ఇంట్రెస్టింగ్ అప్డేట్ ని అయితే వదిలారు.

ఈ సినిమా నుంచి మరిన్ని డీటెయిల్స్ గా ఒక సరికొత్త గ్లింప్స్ ని అయితే ఈ అక్టోబర్ 7న వదలనున్నట్టుగా తెలిపారు. మరి ఈ గ్లింప్స్ చూడాలి. ప్రస్తుతానికి నటీనటులపై ఎలాంటి వివరాలు మేకర్స్ రివీల్ చేయలేదు. పూర్తిగా కొత్త నటీనటులతో సినిమా తెరకెక్కుతున్నట్టు తెలుస్తుంది. మరి గుణశేఖర్ ఈసారి ఎలాంటి ప్లాన్ తో వస్తున్నారో చూడాలి. ఇక ఈ చిత్రానికి నీలిమ గుణ నిర్మాణం వహిస్తుండగా టాలెంటెడ్ సంగీత దర్శకుడు కాల భైరవ సంగీతం అందిస్తున్నాడు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు