“గేమ్ ఛేంజర్” టీవీ ప్రీమియర్ కి డేట్ లాక్!?

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ పుట్టినరోజు కానుకగా వచ్చిన పెద్ది సినిమా అప్డేట్ ఫ్యాన్స్ కి ఫీస్ట్ గా మారింది. ఇక ఈ సినిమా సంబరాల్లో ఫాన్స్ మునిగిపోయారు. అలాగే చాలా మంది సినీ ప్రముఖులు కూడా చరణ్ కి బర్త్ డే విషెస్ చెప్పడం కూడా జరిగింది. ఇక ఈ నేపథ్యంలో తన లాస్ట్ సినిమా గేమ్ ఛేంజర్ పై ఒక సర్ప్రైజింగ్ ట్రీట్ కి ఇపుడు టైం లాక్ అయినట్టుగా తెలుస్తుంది. ఈ చిత్రం ఓటిటి సహా శాటిలైట్ హక్కులు జీ సంస్థ తీసుకున్న సంగతి తెలిసిందే.

మరి ఆల్రెడీ హిందీ వెర్షన్ జీ5లో వచ్చేసింది. ఇక ఇపుడు టీవీ ప్రీమియర్ పై కూడా క్లారిటీ తెలుస్తుంది. దీనితో తెలుగు వరల్డ్టెలివిజన్ ప్రీమియర్ గా ఈ చిత్రం ఈ ఉగాది కానుకగా జీ తెలుగులో సాయంత్రం 6 గంటలకి ప్రసారం కానున్నట్టుగా తెలుస్తుంది. ఆల్రెడీ జీతెలుగు వారు దీనిపై హింట్ కూడా ఇవ్వడం జరిగింది. ఇక ఈ చిత్రానికి థమన్ సంగీతం అందించగా కియారా అద్వానీ అలాగే అంజలి హీరోయిన్స్ గా నటించగా దిల్ రాజు నిర్మాణం వహించారు.

Exit mobile version