“సర్దార్ 2” ట్రీట్ కి డేట్ ఫిక్స్!

“సర్దార్ 2” ట్రీట్ కి డేట్ ఫిక్స్!

Published on Mar 30, 2025 7:00 PM IST

కోలీవుడ్ టాలెంటెడ్ హీరో కార్తీ నటించిన పలు సాలిడ్ హిట్ చిత్రాల్లో మన తెలుగులో కూడా భారీ హిట్ అయ్యిన సినిమాలు ఉన్నాయి. మరి అలాంటి చిత్రాల్లో ఒకటే “సర్దార్”. దర్శకుడు పిఎస్ మిత్రన్ తెరకెక్కించిన ఈ సాలిడ్ స్పై యాక్షన్ థ్రిల్లర్ కమర్షియల్ గా బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది. ఇక దీనికి రెండో భాగాన్ని కూడా మేకర్స్ అనౌన్స్ చేయగా ఇపుడు దీనిపై ఉగాది కానుకగా మేకర్స్ ఇంట్రెస్టింగ్ అప్డేట్ అయితే అందించారు.

ఒక అనౌన్సమెంట్ ప్రోమోతో రేపు మార్చ్ 31న సర్దార్ ప్రోలోగ్ ని రిలీజ్ చేస్తున్నట్టు ప్రకటించారు. ఇక ఈ ప్రోమోలో అయితే పార్ట్ 1 కట్స్ తో పాటుగా ఇపుడు పార్ట్ 2 కట్స్ కూడా కొన్ని చూపించడం మంచి ఎగ్జైటింగ్ గా ఉందని చెప్పాలి. దీనితో పార్ట్ 2 మరింత గ్రాండ్ గా మరింత యాక్షన్ తో ఉండేలా ఉందని చెప్పవచ్చు. ఇక ఈ చిత్రంలో ఎస్ జే సూర్య నటిస్తుండగా మాళవిక మోహనన్ నటిస్తుంది. అలాగే ప్రిన్స్ పిక్చర్స్ వారు నిర్మాణం వహిస్తున్నారు.

వీడియో కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి

సంబంధిత సమాచారం

తాజా వార్తలు