‘సికందర్’ ట్రైలర్‌కు డేట్ ఫిక్స్

బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ నటిస్తున్న లేటెస్ట్ చిత్రం ‘సికందర్’ ఇప్పటికే ప్రేక్షకుల్లో మంచి బజ్ క్రియేట్ చేసింది. ఈ సినిమాను దర్శకుడు ఏఆర్.మురుగదాస్ తెరకెక్కిస్తుండటంతో ఈ మూవీ బాక్సాఫీస్ దగ్గర ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేస్తుందా అని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే, ఈ సినిమాకు సంబంధించిన పోస్టర్స్, టీజర్, సాంగ్స్ ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ అందుకున్నాయి.

కాగా, ఈ సినిమా నుంచి థియేట్రికల్ ట్రైలర్‌ను రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ రెడీ అయ్యింది. ఈ ట్రైలర్‌ను మార్చి 23న రిలీజ్ చేసేందుకు మేకర్స్ సిద్ధమయ్యారు. ఇక ఈ సినిమా ట్రైలర్ ప్రేక్షకులను ఆద్యంతం ఆకట్టుకోవడం ఖాయమని చిత్ర యూనిట్ చెబుతోంది. ఈ సినిమాలో సల్మాన్ ఖాన్ పాత్ర అభిమానులకు ట్రీట్ ఇస్తుందని వారు చెబుతున్నారు.

ఈ సినిమాలో అందాల భామ రష్మిక మందన్న హీరోయిన్‌గా నటిస్తుండగా సత్యరాజ్, షర్మాన్ జోషి, కాజల్ అగర్వాల్ తదితరులు ఇతర ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. సంతోష్ నారాయణ్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాను మార్చి 30న గ్రాండ్ రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ రెడీ అయ్యింది.

Exit mobile version