SWAG: ‘శ్వాగ్’ ట్రైలర్‌కు డేట్ ఫిక్స్

యంగ్ హీరో శ్రీవిష్ణు నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘శ్వాగ్’ ప్రేక్షకుల్లో మంచి బజ్‌ని క్రియేట్ చేసింది. ఈ సినిమాను దర్శకుడు హసిత్ గోలి డైరెక్ట్ చేయగా, పూర్తి కామెడీ ఎంటర్‌టైనర్‌గా ఈ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకునేందుకు సిద్ధమైంది. ఈ మూవీలో శ్రీ విష్ణు ఏకంగా 4 పాత్రల్లో నటిస్తుండటంతో ఈ సినిమాను ఎప్పుడెప్పుడు చూద్దామా అని ప్రేక్షకులు ఆసక్తిగా చూస్తున్నారు.

ఇప్పటికే రిలీజ్ అయిన ఈ మూవీ పోస్టర్స్, టీజర్, సాంగ్స్‌కి మంచి రెస్పాన్స్ లభించింది. అయితే, ఈ చిత్ర థియేట్రికల్ ట్రైలర్‌ను రిలీజ్ చేసేందుకు మేకర్స్ రెడీ అయ్యారు. ‘శ్వాగ్’ ట్రైలర్‌ను సెప్టెంబర్ 29న రిలీజ్ చేస్తున్నట్లు చిత్ర యూనిట్ అనౌన్స్ చేసింది. దీంతో ఈ ట్రైలర్ ఎలాంటి ఎంటర్‌టైనింగ్ కంటెంట్‌తో రాబోతుందా అని ప్రేక్షకులు ఎదురుచూస్తున్నారు.

ఈ సినిమాలో రీతూ వర్మ, మీరా జాస్మిన్, దక్ష నాగర్కర్, శరణ్య ప్రదీప్, సునీల్, గెటప్ శ్రీను, రవిబాబు తదితరులు ఇతర ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని అక్టోబర్ 4న గ్రాండ్ రిలీజ్ చేసేందుకు మేకర్స్ రెడీ అవుతున్నారు.

Exit mobile version