‘వీర ధీర శూర’ తెలుగు ట్రైలర్ వచ్చేది ఎప్పుడంటే?

‘వీర ధీర శూర’ తెలుగు ట్రైలర్ వచ్చేది ఎప్పుడంటే?

Published on Mar 21, 2025 10:00 PM IST

తమిళ స్టార్ హీరో చియాన్ విక్రమ్ నటిస్తున్న లేటెస్ట్ చిత్రం ‘వీర ధీర శూర’ పార్ట్ 2 ఇప్పటికే షూటింగ్ పనులు ముగించుకుని రిలీజ్‌కు రెడీ అయ్యింది. ఈ సినిమాను దర్శకుడు ఎస్.యు. అరుణ్ కుమార్ డైరెక్ట్ చేస్తున్నాడు. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజ్ అయిన పోస్టర్స్, టీజర్, సాంగ్స్ ఈ మూవీపై మంచి బజ్ క్రియేట్ చేశాయి. ఇక ఇప్పుడు ఈ బజ్‌ను మరింత పెంచేందుకు ఈ చిత్ర తెలుగు థియేట్రికల్ ట్రైలర్‌ను రిలీజ్ చేసేందుకు మేకర్స్ సిద్ధమయ్యారు.

ఈ చిత్రాన్ని పూర్తి రా అండ్ రస్టిక్ యాక్షన్ థ్రిల్లర్‌గా మేకర్స్ రూపొందిస్తున్నారు. ఇక ఈ సినిమా ట్రైలర్‌ను మార్చి 22న రిలీజ్ చేయబోతున్నట్లు చిత్ర యూనిట్ తెలిపింది. ఈ సినిమాలో విక్రమ్ సరికొత్త లుక్‌తో కనిపిస్తుండగా ప్రముఖ నటుడు ఎస్.జే.సూర్య ఈ చిత్రంలో విలన్ పాత్రలో నటిస్తున్నాడు. ఇక తనదైన సంగీతంతో జి.వి.ప్రకాష్ కుమార్ ఈ చిత్రాన్ని ఆసక్తికరంగా మార్చేందుకు ప్రయత్నిస్తున్నాడు.

కాగా ఈ చిత్ర ట్రైలర్ ఎలాంటి ఇంపాక్ట్ చూపిస్తుందా అని అందరూ ఆసక్తిగా చూస్తున్నారు. ఈ సినిమాలో దుషారా విజయన్ హీరోయిన్‌గా నటిస్తోండగా తెలుగులో మైత్రీ మూవీ డిస్ట్రిబ్యూటర్స్ రిలీజ్ చేస్తున్నారు. ఈ సినిమాను మార్చి 27న గ్రాండ్ రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ రెడీ అయ్యింది

సంబంధిత సమాచారం

తాజా వార్తలు