ఐపీఎల్ టోర్నీలో భాగంగా జరిగిన చెన్నై సూపర్ కింగ్స్ వర్సెస్ ఢిల్లీ క్యాపిటల్స్ మ్యాచ్ ఉత్కంఠభరితంగా సాగింది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఢిల్లీ క్యాపిటల్స్ తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. తొలి వికెట్ త్వరగా పడినప్పటికీ, ఆ తర్వాత బ్యాట్స్‌మెన్లు జాగ్రత్తగా ఆడారు. కెఎల్ రాహుల్(77), అభిషేక్ పొరెల్(33), అక్సర్ పటేల్(21), స్టబ్స్(24 నాటౌట్) రాణించడంతో ఢిల్లీ 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 183 పరుగులు చేసింది.
ఇక 184 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్‌కు వచ్చిన చెన్నై సూపర్ కింగ్స్ ఓపెనర్లు త్వరగానే ఔట్ అయ్యారు. దీంతో మిడిలార్డర్ బ్యాట్స్‌మెన్ విజయ్ శంకర్ (69 నాటౌట్), ధోని(30 నాటౌట్) మాత్రమే మ్యాచ్‌ను ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేశారు. కానీ, అప్పటికే పరిస్థితులు చెన్నై చేజారాయి. దీంతో నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 158 పరుగులు చేసి CSK వరుసగా మూడో ఓటమిని మూటగట్టుకుంది. ఇక చెపాక్ స్టేడియంలో 17 సంవత్సరాల తర్వాత చెన్నై పై ఢిల్లీ క్యాపిటల్స్ విజయం సాధించడం విశేషం.