సమీక్ష: “డెడ్ పూల్ & వుల్వరిన్” – ఇంప్రెస్ చేసే యాక్షన్ ఎంటర్టైనర్

సమీక్ష: “డెడ్ పూల్ & వుల్వరిన్” – ఇంప్రెస్ చేసే యాక్షన్ ఎంటర్టైనర్

Published on Jul 26, 2024 12:00 PM IST
Deadpool & Wolverine Movie Review in Telugu

విడుదల తేదీ : జూలై 26, 2024

123తెలుగు.కామ్ రేటింగ్ : 3.25/5

నటీనటులు: రేయాన్ రేనాల్డ్స్, హ్యూ జాక్‌మన్, ఎమ్మా కొరిన్, మోరెనా బకారిన్, రాబ్ డెలానీ, లెస్లీ ఉగ్గమ్స్, ఆరోన్ స్టాన్‌ఫోర్డ్, మాథ్యూ మక్‌ఫాడియన్

దర్శకుడు: షాన్ లెవీ

నిర్మాతలు : మార్వెల్ స్టూడియోస్, మాగ్జిమమ్ ఎఫర్ట్స్, 21 ల్యాప్స్ ఎంటర్టైన్మెంట్స్.

సంగీత దర్శకుడు: రాబ్ సైమన్సన్

సినిమాటోగ్రఫీ: జార్జ్ రిచ్‌మండ్

ఎడిట‌ర్ : డీన్ జిమ్మెర్‌మాన్, షేన్ రీడ్

సంబంధిత లింక్స్: ట్రైలర్

ప్రపంచ ప్రఖ్యాత సూపర్ హీరో కామిక్ సంస్థ మార్వెల్ స్టూడియోస్ నుంచి వచ్చిన లేటెస్ట్ అవైటెడ్ సినిమానే “డెడ్ పూల్ & వుల్వరిన్” . మార్వెల్ కామిక్స్ లో మంచి క్రేజ్ ఉన్న రెండు సూపర్ పాత్రలు కలయికలో వస్తుండడంతో దీనిపై ఎప్పుడు నుంచో భారీ హైప్ ఉంది. దీనితో ఈ సాలిడ్ ప్రాజెక్ట్ చూసేందుకు ఇండియన్ ఆడియెన్స్ సైతం ఆసక్తి కనబరిచారు. మరి ఈ చిత్రం ఎంతమేర ఆకట్టుకుందో ఇప్పుడు సమీక్షలో చూద్దాం రండి.

కథ:

ఇక కథలోకి వస్తే.. డెడ్ పూల్ – వేడ్ విల్సన్ (రేయాన్ రెనాల్డ్స్) ఎర్త్ 616 లో ఎవెంజర్స్ తో కలవాలని ఆరాటపడతాడు, కానీ తనకున్న సహజ బుద్ది మూలాన అందుకు పనికిరాడు అని వారు అతన్ని తప్పిస్తారు. దీనితో తన లైఫ్ లో అప్పటివరకు చేసిన తప్పులు కాకుండా ఒక రియల్ హీరో అనిపించుకోవాలని చూసే కల కలగానే ఉంటుంది అనే సమయంలో టివిఎ(టైం వేరియెన్స్ అథారిటీ) వారు అతన్ని ఎర్త్ 10005 కి తీసుకెళ్తారు. మరి ఈ క్రమంలో డెడ్ పూల్ కి సాయం అవసరం అవుతుంది. అలా తాను వోల్వరైన్ – లోగన్ (హ్యూ జాక్ మాన్) ని కలిసేందుకు సిద్ధం అవుతాడు. మరి అక్కడ నుంచి ఈ ఇద్దరి కలయిక ఎలా జరుగుతుంది? డెడ్ పూల్ కి లోగన్ అవసరం ఎంత ఏమొచ్చింది? లోగన్ లో చనిపోయిన వోల్వరైన్ ఇప్పుడు ఎలా బతికి ఉన్నాడు? మిగతా సినిమాల్లో కూడా కంటిన్యూ అవుతాడా? ఇద్దరు కలిసి చేసే సాహసాలు ఏంటి? వీరి మధ్యలో లోగన్ చెల్లెలు కాసాండ్రా నోవా(ఎమ్మా కోరిన్) పాత్ర ఏంటి లాంటివి తెలియాలి అంటే ఈ చిత్రాన్ని బిగ్ స్క్రీన్స్ పై చూడాల్సిందే.

ప్లస్ పాయింట్స్:

మరి ఈ సినిమాలో మేజర్ ప్లస్ పాయింట్ ఏదన్నా ఉంది అంటే ఆ ఎంటర్టైనింగ్ నరేషన్ అని చెప్పాలి. మొదటి నుంచి ఎండింగ్ వరకు కూడా హిలేరియస్ కామెడీతో కొనసాగే ఎంటర్టైన్మెంట్ సినిమాలో అదిరిపోతుంది. మెయిన్ గా నాన్ స్టాప్ గా సాగే డెడ్ పూల్ రోల్ పై మాటలు, సెటైర్స్, వన్ లైనర్ డైలాగ్ లు ఇంకా మన తెలుగు ఆడియెన్స్ కి బాగా కనెక్ట్ అయ్యే వన్ లైనర్స్ అయితే సినిమాలో క్రేజీ లెవెల్లో నవ్వు తెప్పిస్తాయి అని చెప్పాలి.

ఇక వీటితో పాటుగా ఈ క్రేజీ కలయిక కోసం ఎదురు చూస్తున్న మార్వెల్ ఫ్యాన్స్ కి ఈ చిత్రం ఒక ఫీస్ట్ అని చెప్పవచ్చు. కొన్ని ఐకానిక్ షాట్స్ అయితే సినిమాలో చూసేందుకు మంచి హై ని తీసుకొస్తాయి. సినిమాలో డెడ్ పూల్ పై మొదటి ఫైట్ కం టైటిల్ కార్డ్స్ అయితే మ్యాడ్ లెవెల్లో కొత్తగా ఉన్నాయని చెప్పాలి. ఇక డెడ్ పూల్ గా రేయాన్ రెనాల్డ్స్ ఎప్పటిలానే అదరగొట్టేసాడు. తన మార్క్ కామెడీ టైమింగ్, యాక్షన్ సీక్వెన్స్ లతో మంచి ఫీస్ట్ ని తాను అందించాడు.

లెజెండరీ నటుడు హ్యూ జాక్ మాన్ ని చాలా ఏళ్ల తర్వాత మళ్ళీ వుల్వరరిన్ గా చూడడం అనేది ఫ్యాన్స్ కి మంచి ఎమోషనల్ ట్రీట్ ని అందిస్తుంది. ఇక తన రోల్ లో సాలిడ్ పెర్ఫామెన్స్ ని తాను అందించగా క్లైమాక్స్ లో తన ఫిజిక్ షో అయితే ఆశ్చర్యపరుస్తుంది. అలాగే సినిమాలో ఆడియెన్స్ ని మెయిన్ గా మర్వెల్ ఫ్యాన్స్ ని ఎగ్జైట్ చేస్తూ ఆశ్చర్యం కలిగించే అంశాలు కూడా చాలానే ఉన్నాయి. కొన్ని సర్ప్రైజింగ్ పాత్రలు, క్యామియోస్ అబ్బురపరుస్తాయి.

ఇంకా క్లైమాక్స్ ఎపిసోడ్ కూడా మంచి హై ని ఆడియెన్స్ లో కలిగిస్తుంది. ఇక సినిమాలో మెయిన్ లీడ్ సహా ఇతర నటీనటులు కూడా అదరగొట్టారు. లేడీ విలన్ ఎమ్మా కోరిన్ తన రోల్ లో సాలిడ్ పెర్ఫామెన్స్ ని కనబరిచింది. అలాగే డిఫ్నే కీన్, రాబ్ డిలానే అలాగే కొందరు వింటేజ్ మార్వెల్ నటీనటులు నటనతో పాటుగా పలు యాక్షన్ సీన్స్ లో అదరగొట్టేసారు.

మైనస్ పాయింట్స్:

ఈ చిత్రంలో ఎంటర్టైన్ చేసే అంశాలు చాలానే ఉన్నప్పటికీ సరైన ఎమోషన్స్ ఈ సినిమాలో బాగా మిస్ అయ్యాయని చెప్పాలి. ఇద్దరు బిగ్ స్టార్స్ ఉన్నప్పటికీ ఎమోషనల్ బ్యాలన్స్ మిస్ అయ్యినట్టుగా బాగా కనిపిస్తుంది. దీనితో సినిమా నిడివి తక్కువే అయినప్పటికీ అక్కడక్కడా బోర్ గా అనిపించక మానదు. అలాగే ఈ సినిమాలో ఏ రేటెడ్ డైలాగ్స్ కూడా ఎక్కువే ఉన్నాయి సో అందరి ఆడియెన్స్ కొంచెం కంఫర్టబుల్ గా ఫీల్ కాకపోవచ్చు. సో ఇది కూడా దృష్టిలో పెట్టుకోవాలి.

అలాగే ఈ సినిమా డైరెక్ట్ గా చూసేవారికి ఒకింత కన్ఫ్యూజన్ గా కూడా అనిపించే ఛాన్స్ ఉంది. ఆ వేరియెంట్స్ ఏంటి, టైం లైన్స్ ఇలా కొన్ని అంశాలు మార్వెల్ సినిమాలు, కంటెంట్ బాగా ఫాలో అయ్యేవారికి తప్ప మిగతా జెనరల్ ఆడియెన్స్ కి కన్ఫ్యూజన్ గా అనిపించవచ్చు. ఇంకా సినిమాలో కొన్ని చోట్ల విజువల్ ఎఫెక్ట్స్ కూడా మరీ అంత నాచురల్ గా కనిపించవు.

సాంకేతిక వర్గం:

ఈ చిత్రంలో నిర్మాణ విలువలు చాలా బాగున్నాయి. ప్రొడక్షన్ డిజైన్, యాక్షన్ బ్లాక్ లు సినిమాలో అదిరిపోయాయి. అలాగే మ్యూజిక్ కూడా చాలా బాగుంది. మెయిన్ గా తెలుగు డబ్బింగ్ మాత్రం అదిరిపోయింది అని చెప్పొచ్చు. ప్రతి పాత్రకి నాచురల్ డబ్బింగ్ లెవెల్లో ప్లాన్ చేశారు. అలాగే తెలుగులో డైలాగ్స్ ని బివి రమణయ్య డైరెక్ట్ చేయగా వీఱ్ఱి వేణుగోపాల్ రెడ్డి తర్జుమా చేశారు. వీరి వర్క్ మాత్రం ఈ సినిమాకి తెలుగు ఆడియెన్స్ మైండ్ బ్లాక్ చేస్తుంది. ఆ రేంజ్ లో అవుట్ పుట్ ని వన్ లైనర్స్ అదిరిపోయాయి.

ఇక దర్శకుడు షాన్ లేవి ఈ సినిమాకి సాలిడ్ వర్క్ ని అందించారు అని చెప్పాలి. అలాగే షాన్ తో పాటుగా నటుడు రేయాన్, కూడా స్క్రిప్ట్ అండ్ స్క్రీన్ ప్లే లో భాగం అయ్యాడు. వీరి స్క్రీన్ ప్లే కూడా సినిమాలో నీట్ గా ఉంది. కాకపోతే కొంచెం సాలిడ్ ఎమోషన్స్ ని కూడా జోడించి ఉండుంటే సినిమా మరింత స్థాయిలో అదరగొట్టేది అని చెప్పడంలో సందేహం లేదు.

తీర్పు:

ఇక మొత్తంగా చూసినట్టు అయితే ఈ అవైటెడ్ “డెడ్ పూల్ & వుల్వరిన్” అయితే మార్వెల్ ఫ్యాన్స్ కి మంచి ఫీస్ట్ అని చెప్పవచ్చు. ఎవరెవరు అయితే ఈ డెడ్లీ కాంబినేషన్ కోసం ఎదురు చూస్తున్నారో వారు అందరికీ ఈ చిత్రం మంచి ట్రీట్ అందిస్తుంది. అలాగే తమ రోల్స్ లో రేయాన్, హ్యూ జాక్ మాన్ లు అదరగొట్టారు. ఇంకా సాలిడ్ యాక్షన్ సీన్స్, తెలుగులో హిలేరియస్ డైలాగ్స్, ఎంటర్టైనింగ్ నరేషన్, డీసెంట్ ఎమోషనల్ క్లైమాక్స్ ఇంకా కొన్ని సర్ప్రైజ్ లు సినిమాలో ఎగ్జైటింగ్ గా నిలిచాయి. కాకపోతే సినిమాలో కొంచెం ఎమోషనల్ బ్యాలన్స్ మిస్ కావడంతో కొన్ని చోట్ల మాత్రం కొంచెం డల్ గా అనిపిస్తుంది. ఇవి మినహా ఈ సినిమా థియేటర్స్ లో ఎంటర్టైన్ చేస్తుంది.

123telugu.com Rating: 3.25/5

Reviewed by 123telugu Team

Click Here For English Review

సంబంధిత సమాచారం

తాజా వార్తలు